తెలంగాణ

తెలంగాణాలో మరో మంకీపాక్స్ కేసు గుర్తింపు

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఖమ్మంలో ఈ కేసును గుర్తించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వైద్య వర్గాల మేరకు ఆరముంపుల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉండే గ్రానైట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయన గత మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆ తర్వాత అతని శరీరంపై బొబ్బలు రావడాన్ని వైద్యులు గుర్తించారు. ఆ వెంటనే ఆ వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు రావడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మంకీపాక్స్‌ వైరస్‌గా ప్రాథమికంగా ఓ నిర్థారణకు వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, అతనితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో జిల్లా వైద్యాధికారులు నిమగ్నమయ్యారు.

Leave a Reply