తెలంగాణ

మోకాళ్ళపై నిలబెట్టిందనీ 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : హైదరాబాద్ హయత్ నగరులో ఎనిమిదో తరగతి విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్లాస్ టీచర్ మోకాళ్ళపై నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూలులో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్‌లో హోం వర్క్ చేయలేదని టీచర్ మందలిచింది. అదేసమయంలో ఆ విద్యార్థిని తరగతి గదిలో అల్లరి చేయడాన్ని గమనించి మోకాళ్లపై నిలబెట్టింది. దీంతో సాటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని భావించి తీవ్ర మనస్తాపానికి లోనైంది.

సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మాయనికా ఆస్పత్రి తరలించారు.

టీచర్ మందలించడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యార్థిని బలవన్మరణానికి స్కూలు యాజమాన్యం నైతిక బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply