కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్

చైనా : కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను అతలాకుతలం చేసిన కరోనా వుహాన్ నగరంలోనే పుట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ వుహాన్‌లో కరోనా కేసులకు తక్కువేం లేదు. తాజాగా వుహాన్‌లో 18 కొత్త కోవిడ్ కేసులను గుర్తించారు. దీంతో చైనాలోవి వుహాన్ నగరం లాక్‌డౌన్ గుప్పిట్లోకి వెళ్లింది.

కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయి. ఆదివారం వరకు ఇవే ఆంక్షలు కొనసాగుతాయి. 2019 చివర్లో కోవిడ్ మహమ్మారి వుహాన్‌లోనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: