ఆంధ్రప్రదేశ్

బిగ్‌బాస్‌ ఓ పనికిరాని షో … కంచరణ కిరణ్ సీరియస్ కామెంట్స్

విశాఖపట్నం : బిగ్‌బాస్ ప్రోగ్రాంపై సార్క్ నేషన్స్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం మరియూ భారతీయ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కంచరణ కిరణ్ కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ ప్రోగ్రాం ఓ వేస్ట్ షో అంటూ ఆయన ఫైరయ్యారు. బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి గానీ, ప్రజలకు గానీ ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. ‘ఈ షో ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది? ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయి? ఇలాంటి బూతుల ప్రపంచం వందల కోట్ల వ్యాపారానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. నేరాలు పెరగడానికి ఇలాంటి షో లే కారణమౌతున్నాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను అరికట్టాలని సూచించారు. బిగ్ బాస్ పై హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఈ విషయమై ఆలోచించాలని ఆయన కోరారు.

Leave a Reply