ఆంధ్రప్రదేశ్

దుష్ట చతుష్టయం ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు

శృంగవరపుకోట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దుష్ట చతుష్టయం చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి 158 వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామపంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలుకారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విపులంగా వివరిస్తూ, అర్హత కలిగి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. ఏ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం తద్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పినిశెట్టి వెంకటరమణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ రెహమాన్, పోతనపల్లి గ్రామ సర్పంచ్ వెంకట్రావు, ఏఎంసి డైరెక్టర్ పార్వతి, ఎంపీటీసీ కనకమహాలక్ష్మి, వైసిపి నాయకులు అల్లుమహాలక్ష్మి నాయుడు, అల్లు సుధీర్, లగుడు అవతారం, లగుడు పైడితల్లి, సత్యారావు, శ్రీనివాసరావు, పైడిరాజు, వర్రి కృష్ణ తదితర వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply