అంతర్జాతీయ వార్తలు

ప్రపంచంలోనే నెం.1 లీడర్‌గా భారత ప్రధాని మోదీ

అమెరికా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నెం.1 నాయ‌కుడిగా ఘనత సాధించారు. అత్యంత ప్రజా ఆమోదం ఉన్న దేశాధినేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. ఈ లిస్టులో మోదీ తర్వాతే అగ్రరాజ్యం అమెరికా నేతలు కూడా నిలిచారు.

ఈ స‌ర్వేలో ప్ర‌ధాని నరేంద్ర మోదీకి సానుకూలంగా 75 శాతం మంది, వ్యతిరేకంగా 25 శాతం మంది స్పందించడం విశేషం. ఈ సర్వేలో 22 మంది ప్రపంచ నాయకులపై ఓటింగ్ నిర్వ‌హించారు. ప్రధాని మోదీ తర్వాత.. 63 శాతం ప్ర‌జామోదంతో మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ డో స్థానంలో నిలిచారు.

అంతకుముందు జనవరి 2022లో నిర్వ‌హించిన స‌ర్వేలోనూ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

Leave a Reply