ఆంధ్రప్రదేశ్

సెల్ఫోన్ అనార్థాలకు దూరంగా ఉండండి..పలాస జూనియర్ సివిల్ జడ్జి పి రవిశంకర్…!!

శ్రీకాకుళం, పలాస (కాశీబుగ్గ) : శ్రీవిధ్యావాహిని కళాశాల న్యాయ విజ్ఞాన సదస్సులో పలాస జూనియర్ సివిల్ జడ్జి పి రవిశంకర్ మాట్లాడతూ సెల్ఫోన్ను అనార్థాలకు వాడకుండా దూరంగా ఉండాలని పలాస జూనియర్ సివిల్ జడ్జి, పలాస మండల లీగల్ సర్వీస్ కమిటీస్ ఛైర్మన్ పి రవిశంకర్ అన్నారు. పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ శ్రీవిద్యావాహిని డిగ్రీకళాశాలలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఫేస్బుక్, ఇన్స్టాగాంతో పాటు వివిధ రకాల సోషల్మీడియా రూపంలో బాలబాలికలకు తప్పుదోవపట్టించి చివరకు ప్రాణాలపైకి వస్తుందన్నారు. కేవలం అవసరానికి మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థి దశలో అయితే పూర్తిగా దూరంగా ఉంచాలన్నారు. మైనర్లు ఏమి చేస్తున్నారనేది తల్లిదండ్రులు కంట కనిపెడుతుండాలన్నారు. విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, ఐటి యాక్టులపై పలువురు న్యాయవాదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విధ్యావాహిణి కరస్పాండెంట్ పైల తిరుమలరావు, ప్రభుత్వ న్యాయవాది దేవరాజు, సీనియర్ అడ్వొకేటెస్ బికెఆర్ పట్నాయిక్, పిండి వెంకటరావు, రజినీకుమార్, సయ్యుద్ అహ్మద్, ఉషారాణి, ఎస్ఐ శంకరరావు, సిసి నారాయణ తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply