ఆంధ్రప్రదేశ్

ఇంట్లోనే భర్తకు దహన సంస్కారాలు చేసిన భార్య

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండలో విషాద ఘటన జరిగింది. ఇంట్లోనే భర్తకు భార్య దహన సంస్కారాలు చేయడం సంచలనం రేపింది. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌(60) స్థానికంగా మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డారు. సోమవారం ఉదయం హరికృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. అయితే కుమారులు తమను సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ దగ్గరికి వస్తున్నారని భార్య లలిత తెలిపారు. అందుచేత తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారనే కారణంతో ఇంట్లోనే భర్తకు దహన సంస్కారాలు పూర్తిచేసినట్లు ఆమె తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply