సిని వార్తలు

చిరంజీవి సినిమాలో ప్రజా గాయకుడు గద్దర్‌

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’చేస్తున్న చిరు.. ఆ తర్వాత మోహన్‌ రాజా దర్శకత్వంలో గాడ్‌ ఫాదర్‌లో నటించబోతున్నాడు. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది. ఇందులో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు దర్శక, నిర్మాతలు గద్దర్‌ని సంప్రదించారని, పాత్ర నచ్చడంతో ఆయన ఈ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే షెడ్యూల్‌లో గద్దర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేయనున్నారని సమాచారం. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో గద్దర్‌ పాల్గొననున్నారట. ఆయనతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుసోస్తోంది.

Leave a Reply