తెలంగాణ

అసలు శ్రీరామనవమి ఎందుకు జరుపుతారో తెలుసా…?

భద్రాచలం : శ్రీరామ… ఈ పేరు వింటేనే మనసుకు ఎంతో శాంతి కలుగుతుంది. మనసంతా ఆహ్లాదకరంగా ఉప్పొంగి పోతుంది. మన చుట్టూ ఉన్న ప్రదేశమంతా ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. అంతటి గొప్పతనం ఉంది ఆ శ్రీరాముడి నామానికి. లోక కల్యాణం కోసం అవతరించిన మానవుడు శ్రీరాముడిని పురాణాలు చెబుతున్నాయి. తండ్రి మాట జవదాటని తనయుడిగా, తమ్ముళ్లను సొంత బిడ్డలుగా చూసుకొన గల మహాత్ముడనీ, ప్రజలలో సుఖ సంతోషాలు నింపి రాజ్యమేలిన గొప్ప చక్రవర్తి అని, అత్యుత్తమ రాజు అని, అసత్యం పలకని ధర్మమూర్తి అని,

ఏకపత్నీవ్రతుడు అని ఆ శ్రీ రాముడు పేరు ప్రఖ్యాతులు గాంచారు.మన దేశంలో, అయోధ్యలో ప్రస్తుతం శ్రీ రామ మందిరం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆలయం అనగానే వేల కోట్ల రూపాయలు విరాళాలుగా చేరాయి. అంతటి భక్తజనం ఉంది ఆ శ్రీరామునికి. శ్రీరామనవమి నాడు ఆ రామునికి ప్రత్యేక పూజలు జరిపి, శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేశంలోని అన్ని శ్రీరాముని దేవాలయాలలో, అదే విధంగా ఆయన పరమభక్తుడైన ఆంజనేయస్వామి దేవాలయాల లోనూ శ్రీరామ నవమిని ఎంతో ఘనంగా జరుపుతారు.

ఇదే రోజు అప్పట్లో శ్రీరామునుకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిందని, అంతేకాక ఇదే రోజున సీతమ్మకు, శ్రీరామునికి వివాహం జరిగింది.అందుకే ఈ రోజున లోకమంతా శ్రీమనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని మన పురాణాలు చెబుతున్నాయి. లోక కళ్యాణం కోసం విష్ణువు దశావతారములు ఎత్తగా…. రాముని ఏడో అవతారం అని ప్రతీతి .ఆ లక్ష్మీ దేవి విష్ణువుకి త్రేతాయుగంలో సీతమ్మగా జన్మించి రాముడిని వివాహమాడింది అంట.

ఇలా శ్రీ రాముని చరిత్ర ఎంతో కమనీయం.. ఆనందభరితం. అందుకే ఈ రోజున రామ భక్తులంతా ఈ పర్వ దినాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఆ రోజు భక్తులు శ్రీ రాముని కోసం ఉపవాసాలు చేయడం జరుగుతుంది.

Leave a Reply