ఆంధ్రప్రదేశ్

గుడివాడలో కొడాలి నానిని ఓడించి తీరుతాం: కాపు నేతలు

KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన నేతలు డిమాండ్ చేశారు. ఓ బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ కులం పేరుతో బూతులు మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. కొడాలి నాని తీరును రాష్ట్రంలోని అన్ని వర్గాలు గమనిస్తున్నాయని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసినంత మాత్రాన సరిపోదని ఇతర కులాలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

కొడాలి నాని తీరును వైసీపీలోని కాపు నాయకులు వ్యతిరేకించాలని కోరారు. కాపు జాతిని కించపరడం యావత్ రాష్ట్రానికి అవమానమని వ్యాఖ్యానించారు. గుడివాడలో కొడాలి నాని గెలిచింది కాపు ఓట్లతోనేనని… వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని సవాల్ విసిరారు. కాగా సోమవారం ప్రెస్ మీట్‌లో చంద్రబాబు, లోకేశ్‌లను తిడుతూ కాపులను ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply