Warning: Undefined array key -1 in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/post-template.php on line 330
జాతీయ వార్తలు

ఉద్ధవ్ థాక్రే సీఎం పోస్టు ఊడిపోవడానికి హనుమంతుడు కారణమా?

మహారాష్ట్ర : ఉద్ధవ్ థాక్రే సీఎం పోస్టు పోవడానికి కారణం భజరంగభళీ హనుమంతుడు అంటూ మహారాష్ట్రలో కొందరు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం… ఉద్ధవ్ థాక్రే హనుమంతుడి హనుమాన్ చాలీసా పఠనం చేయకుండా అడ్డుకోవడమేనని అంటున్నారు. కాస్త వివరంగా చెప్పుకోవాలంటే…

సినీ నటి, భాజపా నాయకురాలు నవనీత్ కౌర్ ‘మాతోశ్రీ’ ముందు హనుమాన్ చాలీసా పఠించాలని పట్టుబట్టింది. అందుకు సీఎం థాక్రే తనకు, ఆమెకి కార్యకర్తలకు ఒక టెంట్ వేసి, టీ మరియు అల్పాహారం ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి ఇలా వుండేది కాదంటున్నారు.

హునుమాన్ జయంతి సందర్భంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని లేకుంటే తామే సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్ రాణా, రవి రాణాలు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన అధికార శివసేన పార్టీ కార్యకర్తలు ఖార్‌లోని నవనీత్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత నవనీత్ కౌర్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాలపై ఖార్ పోలీసులు నవనీత్ కౌర్ రాణా దంపతులపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రకరకాల మలుపులు చోటుచేసుకున్నాయి. శివసేనలోనే ముసలం పుట్టింది. రెండు గ్రూపులుగా విడిపోయాయి. విడిపోయిన గ్రూపుకి ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహించారు. ముఖ్యమంత్రి అవకాశం ఆయన్ని వరించింది. దీనంతటికీ కారణం… ఉద్ధవ్ థాక్రే హనుమాన్ చాలీసా పఠనం నిరోధించడమేనని మహారాష్ట్ర లోని ఓ వర్గం అంటుంది. మరి భజరంగభళి ఆ పని చేసారా…?

Leave a Reply

%d bloggers like this: