క్రీడా వార్తలు

పారిస్ ఒలింపిక్స్ లో మెగా మెరుపులు.. త్రివర్ణ పతాకంతో చిరంజీవి-రామ్ చరణ్

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పారిస్ :- 2024 ఒలింపిక్స్‌లో రామ్ చరణ్ – చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాకరేను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం తన కుటుంబంతో పారిస్‌లో ఉన్నారు. ఒలింపిక్స్‌ చూసేందుకు వారంతా అక్కడికి వెళ్లారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పివి సింధుతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఆమెను రాక్‌స్టార్ అని సంబోధిస్తూ భార్య ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు.

మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) తన సినీ జీవితానికి సంబంధించి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. . అయితే, ఈ మధ్య ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో హైలైట్ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన (Upasana), కూతురు క్లింకారా తో కలిసి ఒలింపిక్స్ జరుగుతున్నా పారిస్ లో సందడి చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుండి నిర్వహిస్తున్నారు. ఇది ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. ఒలింపిక్స్ చూసేందుకు వెళ్లిన మెగా ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. .

చిరంజీవి జూలై 29న సోషల్ మీడియాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఫోటోలో, ఆయన, రామ్ చరణ్ కలిసి త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు. రెండవ ఫొటోలో, రామ్ చరణ్ భార్య ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కూడా ఉన్నారు. ఫోటోలను షేర్ చేస్తూ, “ఒలింపిక్స్‌లో కుటుంబంతో ఉన్నాను. భారత్ ముందుకు సాగాలి. జై హింద్.” అంటూ చిరంజీవి క్యాప్షన్‌ ఇచ్చారు.

పారిస్ ఒలింపిక్స్ లో మెగా మెరుపులు

పివి సింధుతో రామ్ చరణ్ – ఉపాసన..

అంతకు ముందు రామ్ చరణ్ కూడా ఒక ఫోటో షేర్ చేశారు. అందులో ఆయన, ఉపాసన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో కలిసి కనిపించారు. పివి సింధు (PV Sindhu) ను రామ్ చరణ్ రాక్ స్టార్ అని పిలిచాడు. “పివి సింధు మీరే నిజమైన రాక్‌స్టార్” అని క్యాప్షన్‌లో రాశారు. పివి సింధు రామ్ చరణ్ కుక్కపిల్లతో సరదాగా గడిపిన ఒక అందమైన వీడియో కూడా కనిపించింది. ఎక్కడెక్కడికైనా దీనిని నీతో తీసుకెళ్తావా అని సింధు రామ్ చరణ్‌ని అడగడం కనిపించింది.

పివి సింధుతో రామ్ చరణ్ – ఉపాసన..

పివి సింధుతో రామ్ చరణ్

మను భాకర్‌కు అభినందనలు..

2024 ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరిచిన మను భాకర్‌ను అభినందిస్తూ రామ్ చరణ్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. “మను భాకర్.. భారతీయులందరూ గర్వపడేలా చేసింది. ఇలాగే చేస్తూ ఉండండి.” అంటూ రామ్ చరణ్ మను ను అభినందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను విజేతగా నిలిచింది. ఆమె ఆ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించారు.

రామ్ చరణ్ సినిమా విషయాలకు వస్తే.. 2022 సంవత్సరంలో విడుదలైన RRR చిత్రం తరువాత ఆయన ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. 1200 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు రామ్ చరణ్‌ని మరోసారి తెరపై చూడాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ త్వరలో ముగియనుంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ పేరుతో రామ్ చరణ్ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించనున్నారు.

గేమ్ ఛేంజర్ విడుదల ఎప్పుడు?

ముందుగా ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలని అనుకున్నా ఆ తర్వాత వాయిదా పడింది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇది యాక్షన్-థ్రిల్లర్ చిత్రం. ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎస్.శంకర్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయిక. అయితే ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ ను ఎంత అద్భుతంగా చూపిస్తాడో అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం షూటింగ్ ప్రారంభించినప్పుడు, బడ్జెట్ రూ. 250 కోట్లు. అయితే పనులు పూర్తయ్యే సరికి ఈ సంఖ్య రూ.400 కోట్లకు చేరింది.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×