తెలంగాణ

మసాజ్ సెంటర్‌లో వ్యభిచార దందా

హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మసాజ్ సెంటర్‌లో వ్యభిచార దందా వెలుగులోకి వచ్చింది. ఏబీఎన్‌ స్టింగ్ ఆపరేషన్‌లో వ్యభిచార దందా బయటపడింది. కేపీహెచ్‌బీలో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్‌లో మసాజ్ సెంటర్ నిర్వాహకులు అడ్డంగా బుక్కయ్యారు. ఏబీఎన్ నిఘాకు ఐదుగురు యువతులు, ఇద్దరు యువకులు దొరికారు. కేపీహెచ్‌బీ పోలీసులతో ఏబీఎన్‌ క్రైమ్ టీమ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply