జాతీయ వార్తలు

అమ్మ అనే మాటలో…ఎన్నో భావోద్వేగాలు : మోదీ

ఢిల్లీ : అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మ అనే మాటలో ఎన్నో భావోద్వేగాలున్నాయి.

అని ట్వీట్ చేసిన మోదీ వ్యాక్యాల్లో ఎన్నో అర్థవంతమైన అర్థాలను వెలికితీస్తున్నారు.

అందులో ఒకటి… మాతృమూర్తి ఆలోచనలు స్ఫూర్తిమంతంగా ఉంటే తనయులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే భావం స్ఫురిస్తుందని ఒకరంటే,

పిల్లలని ఉన్నత స్థాయికి చేరేందుకు తపన పడుతూ తనెంతో దిగువకు వెళ్లి కష్టపడేదే తల్లి అని కూడా వర్ణిస్తున్నారు. ఇంతకీ మోదీ ఏం రాశారంటే…

‘‘నూరేళ్లు పూర్తి చేసుకుని ఆ సర్వేశ్వరుని చెంతకు చేరింది నా తల్లి.

ఒక తప్పసులా ఆమె జీవిత ప్రయాణాన్ని సాగించింది.’’ -భావోద్వేగంతో మోదీ ట్వీట్

అమ్మ అనేది ఒక పదం కాదు…ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్నది..,

అంటూ ఒక బ్లాగ్ లో అమ్మగొప్పతనాన్ని మోదీ వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు. యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. విషయం తెలిసిన వెంటనే మోదీ హుటాహుటిన అహ్మదాబాద్ కు బయలుదేరారు. బెంగాల్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం.

అంతకుముందు రోజు తల్లి ఆసుపత్రిలో ఉండగా గుజరాత్ చేరుకున్న మోదీ గంటకు పైగా ఆసుపత్రిలోనే గడిపారు. అనంతరం మోదీ సోదరుడు సోమాభాయ్ తమ తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు.

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్…ఈ ఏడాది జూన్ నెలలో వందో సంవత్సరంలో అడుగుపెట్టారు. వందేళ్లు సంపూర్ణ జీవితం గడిపిన పరిపూర్ణ మహిళగా అందరూ అభివర్ణించారు. దేశానికి ప్రధానిని చేసే దిశగా తనయుడిని తీర్చిదిద్దిన తల్లిగా కూడా హీరాబెన్ పేరు గడించారు. అంతేకాదు కొడుకు దేశప్రధాని అయినా, అక్కడ లంకంత ఇల్లు, చుటూ డాక్టర్లు, సౌకర్యాలు అన్నీ ఉన్నా సరే, ఎంతో సింపుల్ గా తన చిన్న సొంతింటిలోనే ఉండటం చూస్తే, హీరాబెన్ ఎంత నియమ నిబద్ధతగా పిల్లలను తీర్చిదిద్దారో తెలుస్తుందని పలువురు కొనియాడుతూ ఉంటారు.

1923 జూన్ 18న ఆమె జన్మించారు. అయితే అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ప్రధాని మోదీ తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి గాంధీనగర్ కి సమీపంలోని రేసన్ గ్రామంలో నివసించేవారు. మోదీ గుజరాత్ వెళ్లినప్పుడల్లా ఎంతో కొంత సమయం తీసుకుని తల్లిని పరామర్శించి వెళ్లడం ఆనవాయితీగా ఉండేది.

అలా ఎప్పుడూ తల్లిని కంటికి రెప్పలా చూసుకోవడమే కాదు, ఆమె ఆరోగ్యం పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండేవారు. తన తల్లికి అంకితం చేస్తూ అమ్మ గొప్పతనంపై మోదీ ఒక బ్లాగ్ రాశారు. అమ్మ అంటే ఒక్క పదం కాదని ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.

Leave a Reply