ఆంధ్రప్రదేశ్

బ్యాంకులో సొమ్ముకు భద్రత కల్పించండి

ఇచ్చాపురం : తమ కష్టార్జితాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులలో దాచుకుంటున్నారని, అగంతకులు వాటిని కాజేస్తుండడంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని ఇచ్ఛాపురం అలయన్స్ క్లబ్ ప్రతి నిధులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములు మాయమవుతున్న ఉదంతాలపై క్లబ్ ప్రతినిధులు స్పందించారు. సంస్థ అధ్యక్షులు లోపింటి నర్సింహమూర్తి ఆధ్వర్యంలో సభ్యులు పలువురు సోమవారం పట్టణంలోని పలు బ్యాంకుల మేనేజర్లను కలిసి వినతిపత్రాలు అందించారు. పోగొట్టుకున్నవారి సొమ్మును రికవరీ చేయాలని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా సొమ్ముకు భద్రత కల్పించాలని కోరారు. నాయకులు దక్కత గోపీనాథ్ రెడ్డి, ఉమాశంకర్, ఎల్. వెంకటరావు, ఎత్తైసీ బుజ్జి, బాలకృష్ణ, రమణ, ప్రకాష్, రామారావు పాల్గొన్నారు.

Leave a Reply