ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కంచారన కిరణ్ కుమార్

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తిరుమల :- ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర‌స్వామివారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి‌ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకముందు ఆలయ మహద్వారం చేరుకున్న కిరణ్ కి ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి కిరణ్ ఆలయంలోనికి ప్రవేశించారు. ధ్వజస్తంభం దగ్గర నమస్కరించిన తర్వాత… ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో శ్రీమతి M. గౌతమి కిరణ్ ను, శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. తర్వాత కిరణ్ ఆయన కుటుంబసభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమం లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఏఈవో రమేష్ పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనం తర్వాత గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కాణిపాకం దేవాలయం, శ్రీకాళహస్తి దేవాలయం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలేశ్వర దేవాలయం కూడా దర్శించుకుంటారని తెలిసింది.

Leave a Reply