60వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం నాకు లేదు! సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని 60వ వార్డు కార్పొరేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేపీఎస్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 60వ వార్డు కార్పొరేటర్ ఎన్నికల్లో తాను ఓటు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల పట్ల తన వైఖరిని వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని, అయితే ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు.
దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న సైనికుల త్యాగాలను గుర్తించాలని, ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు దేశభక్తి, నిజాయతీ, బాధ్యతతో పనిచేయాలని అన్నారు.
60వ వార్డులో తన ఓటు వినియోగంపై చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చకు దారితీశాయి.

