Warning: Cannot modify header information - headers already sent by (output started at /var/www/fastuser/data/www/kpsnetwork.in/index.php:1) in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/feed-rss2.php on line 8
జాతీయ వార్తలు – KPS NETWORK https://kpsnetwork.in Digital Media Wed, 03 Apr 2024 03:56:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://i0.wp.com/kpsnetwork.in/wp-content/uploads/2021/08/cropped-television-05-icon.png?fit=32%2C32&ssl=1 జాతీయ వార్తలు – KPS NETWORK https://kpsnetwork.in 32 32 196956755 ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి https://kpsnetwork.in/03/04/2024/2846/ https://kpsnetwork.in/03/04/2024/2846/#respond Wed, 03 Apr 2024 03:56:11 +0000 https://kpsnetwork.in/?p=2846 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మహారాష్ట్ర :- మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఓ టైలరింగ్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పేశారు. ఆ కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు సమాచారం.

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం దాటికి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉదయం 4 గంటలకు టైలరింగ్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

పొగ పీల్చుకొని

అయితే ఈ ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం టైలర్‌ షాప్‌లో జరిగింది. మృతిచెందిన వారు పైఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే టైలర్‌ షాప్‌ అగ్ని ప్రమాదం జరిగాక.. దాని నుంచి వెలువడిన పొగ పీల్చుకొని ఆ కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్‌లో 50కి పైగా ఇళ్లు దగ్ధం

ఇదిలా ఉండగా.. బీహార్‌లో కూడా ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 50కి పైగా ఇళ్లు తగలబడ్డాయి. అలాగే ఓ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కొన్ని లక్షల ఆస్తి బూడిద పాలైయ్యింది. ఓ ఇంట్లోని తండ్రీ కొడుకులు పూర్తిగా కాలిపోయారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

]]>
https://kpsnetwork.in/03/04/2024/2846/feed/ 0 2846
రేపే కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. కవిత గురించి ఏం చెబుతారు? https://kpsnetwork.in/27/03/2024/2834/ https://kpsnetwork.in/27/03/2024/2834/#respond Wed, 27 Mar 2024 10:08:22 +0000 https://kpsnetwork.in/?p=2834 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేజ్రీవాల్ రేపు పూర్తి వివరాలను బయటపెడతారని ఆయన భార్య సునీత చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.ఆయన ఏం చెబుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.కవిత ప్రమేయంపై ఎలాంటి విషయాలు వెల్లడిస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నారు.

దేశంలో ప్రస్తుతం అత్యంత దుమారం రేపుతున్న విషయం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఈడీ అధికారులు వరుసగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఈనెల 21 అరెస్ట్ చేసింది. మార్చి 28 వరకు కోర్టు ఆయనను కస్టడీకి ఇచ్చింది. అరెస్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్ అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక రేపు ఆయనను ఈడీ మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనుంది.

కేజ్రీవాల్ భార్య సంచలన ప్రకటన…

కేజ్రీవాల్‌ను రేపు కోర్టులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన భార్య వీడియోలో సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ రేపు కోర్టులో సంచలన విషయాలు బయటపెడతారని ఆమె పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో చెబుతారని.. దానికి తగిన ఆధారాలను కూడా ఇస్తారని చెప్పారు.

రేపు కోర్టులో ఏం చెప్పబోతున్నారు?

కేజ్రీవాల్ భార్య ప్రకటనతో ఇప్పుడు అందరూ రేపు ఆయన కోర్టులో ఏం చెప్పబోతున్నారు అనేది చర్చించుకుంటున్నారు. రేపు కేజ్రీవాల్ నిజంగానే కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి సంచలన విషయాలను బయటపెడతారా? ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి కూడా మాట్లాడతారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. అసలు కేజ్రీవాల్‌కు ఈ కేసు గురించి ఏం తెలుసు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? లాంటి విషయాలు బయటకు వస్తాయామో అని అనుకుంటున్నారు. దాంతో పాటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి కూడా ఏం చెబుతురోనన్న చర్చ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సాగుతోంది. కేజ్రీవాల్ తన వాదనలో కవిత నిర్దోషి అని చెబితే.. ఆమెకు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉంది.

లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ?

లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో కేజ్రీవాల్‌ రేపు చెబుతారని ఆయన సతీమణి సునీత ఈ రోజు విడుదల చేసిన వీడియోలో వెల్లడించడం కూడా ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ కేజ్రీవాల్ ఇదంతా బీజేపీ కుట్రని చెబుతున్నారు. ఇప్పుడు రేపు కోర్టులో కేజ్రీవాల్ కూడా అదే చెబుతారా? బీజేపీ వాళ్ళ దగ్గరే డబ్బులు అన్నీ ఉన్నాయని ఆయన ప్రకటిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కవిత కూడా నిన్న ముగ్గురు బీజేపీ నేతల గురించి ప్రస్తావించారు. వాళ్లు, వీళ్ళూ ఒక్కటేనా? అని కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి రేపు కేజ్రీవాల్ చెప్పబోయే విషయాల మీద చాలా మంది భవిష్యత్తు ఆధారపడి ఉందన్న చర్చ దేశ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కవిత గురించి ఆయన ఏం చెబుతారోనని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

]]>
https://kpsnetwork.in/27/03/2024/2834/feed/ 0 2834
ఆ డ్రగ్ కంటైనర్ ఏ పార్టీది? సీబీఐ ఏం చెబుతోంది? https://kpsnetwork.in/24/03/2024/2830/ https://kpsnetwork.in/24/03/2024/2830/#respond Sun, 24 Mar 2024 04:15:07 +0000 https://kpsnetwork.in/?p=2830 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- కాదేది కవితకనర్హం.. పాతమాట.. కాదేది రాజకీయానకనర్హం.. కొత్తమాట అని చెప్పలేం కానీ ప్రస్తుతం ఇదే ట్రెండ్.. కాదంటే విశాఖ కంటైనర్ డ్రగ్స్‌ ఇష్యూను అబ్జర్వ్‌ చేయండి.. అసలింతకి సీబీఐ ఆపరేషన్‌ గరుడ ఏంటి? సీల్ తీసిన కంటైనర్‌లో బయటపడ్డ డ్రగ్స్ ఎంత? డ్రగ్స్ తెప్పించిందిదెవరు? ఇప్పుడీ అంశం ఏపీ పాలిటిక్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? నిజంగానే ఈ డ్రగ్స్‌ ఏపీ ఎన్నికల ఫలితాలను షేక్ చేస్తాయా? సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ కంపెనీ బ్రెజిల్ నుంచి ఫీడ్ ఆర్డర్ చేసింది. జనవరి 14న అక్కడి నుంచి షిప్ బయల్దేరింది.

రెండు నెలల పాటు సముద్రంలో జర్నీ చేసింది. ఈ నెల 16న విశాఖ పోర్టుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో షిప్‌లోని ఓ కంటైనర్‌లో.. భారీగా డ్రగ్స్ ఉన్నట్టు ఇంటర్‌పోల్‌కు ఇన్ఫర్మేషన్‌ వెళ్లింది. ఆ ఇన్ఫర్మేషన్‌ ఇండియన్ ఏజెన్సీసీస్‌కు రావడం.. సీన్‌లోకి సీబీఐ ఎంటరవ్వడం.. ఆపరేషన్‌ గరుడను స్టార్ట్ చేసింది.. ఈ నెల 19న విశాఖలో ల్యాండయ్యింది సీబీఐ స్పెషల్ టీమ్.. కంటైనర్‌ను కస్టడీలోకి తీసుకుంది.టెస్ట్‌లు చేస్తే డ్రగ్స్‌ ఉన్న విషయం నిజమే అన్నది కన్ఫామ్ అయ్యింది.ఇక్కడ మొదలైంది రాజకీయ రగడ..

అసలు డ్రగ్స్ ఎవరు పంపారు? ఎవరికి పంపారు?ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది ఈ దందా? ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ అసలు కంటైనర్‌లోకి ఎలా చేరాయి? వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఎలా సప్లై చేద్దామనుకున్నారు? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే పనిలో ఉంది సీబీఐ.వచ్చింది బ్రెజిల్ నుంచి.. తీసుకొచ్చింది చైనా షిప్‌లో.. ఆర్డర్ ఇచ్చింది విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ.. కంపెనీ ఏమో 25 కేజీల చొప్పున ఉన్న వెయ్యిబస్తాల డ్రై ఈస్ట్ ఆర్డర్ ఇచ్చామంటోంది. అంతకుమించి తమకు ఏం తెలియదు.. ఇది కంపెనీ మాట.. NCB డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా టెస్ట్‌ చేస్తే.. అన్నింటిలోనూ కొకైన్, మెధాక్వలైన్ ఉన్నట్టు కన్ఫామ్ చేసింది సీబీఐ.. ఇక దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ షురూ చేసింది..

కానీ ఏపీ పొలిటికల్ లీడర్స్‌ సీబీఐ కంటే ఫాస్ట్ కాబట్టి.. ఈ డ్రగ్స్‌కు ఎవరికి సంబంధించినవో కనిపెట్టేశారు.. కంటైనర్ తెప్పించింది మీరంటే మీరని..అటు వైసీపీ, ఇటు టీడీపీ డైలాగ్‌ వార్‌, ట్వీట్‌ వార్ ప్రారంభించేశాయి. వైసీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్ర అధికారులు సీబీఐకు సహకరించడం లేదు. కంటైనర్‌ తెరవకుండా ఉండేందుకు ప్రయత్నించారు.. ఇది టీడీపీ నేతల మాటలు..

దీనికి కౌంటర్‌గా వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.. కంటైనర్ డెలివరి తీసుకున్న కంపెనీకి పురంధేశ్వరి బంధువులకు సంబంధాలు ఉన్నాయి.. టీడీపీ నేతలు కావాలనే తఆరోపణలు చేస్తున్నారు..
డ్రగ్స్‌ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి.. తప్పు చేసి రివర్స్‌లో తమపైనే ఆరోపణలు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే డ్రగ్స్‌కు టీడీపీ నేతలకే లింకులు ఉన్నాయి. ఓటర్లకు డబ్బులు పంచడానికే ఈ డ్రగ్స్ తెప్పించారు. సంధ్య కంపెనీపై గతంలోనే కేసులు పెట్టాం. ఇది వైసీపీ వర్షన్..

అసలు కేసు విచారణ తేలకముందే ఒకరిపై ఒకరు విమర్శలు వర్షం కురిపించుకుంటున్నారు ఏపీ నేతలు.. వైజాగ్‌ పోలీసులేమో సీబీఐ అధికారులకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాం.. తమపై లేనిపోని ఆరోపణలు వద్దు అంటున్నారు..

ఇలా ఎవరి వర్షన్ ఎలా ఉన్నా.. కథంతా సంధ్యా ఆక్వా కంపెనీ చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ డైరెక్టర్‌, ప్రతినిధులను సీబీఐ టీమ్ క్వశ్చన్ చేసింది. కానీ సరైన సమాధానాలు రాలేదని సీబీఐ టీమ్..
తాము మాత్రం ఆక్వా ఫుడ్‌ను మాత్రమే ఆర్డర్‌ చేశామని చెబుతోంది కంపెనీ. అందరు దొరలే అయితే.. గుమ్మడికాయలను ఎత్తుకెళ్లింది ఎవరు? డ్రగ్స్‌ ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? ఎవరు తెప్పించారు? ఎక్కడికో వెళ్లాల్సిన కంటైనర్.. దారి తప్పి వైజాగ్‌కు వచ్చిందా? ఈ ప్రశ్నలకు సీబీఐ సమాధానం కనుగొనేలోపు.. ఏపీలో పార్టీల సిగపట్లు పీక్స్‌కు చేరడం మాత్రం ఖాయం.

]]>
https://kpsnetwork.in/24/03/2024/2830/feed/ 0 2830
కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా, కొత్త సీఎం వస్తారా? https://kpsnetwork.in/22/03/2024/2827/ https://kpsnetwork.in/22/03/2024/2827/#respond Fri, 22 Mar 2024 03:51:48 +0000 https://kpsnetwork.in/?p=2827 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi CM) అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్ట్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎంగా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi CM) అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్ట్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అరెస్ట్ తర్వాత అనేక చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు కేజ్రీవాల్‌ను ఈడీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని(delhi government) ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎం(new cm)గా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి జైలుకు వెళితే ఢిల్లీ సీఎం ఎవరన్న చర్చ సర్వత్రా నెలకొంది. అయితే దీనిపై కేజ్రీవాల్ అరెస్ట్(arvind kejriwal arrest) అయితే ఎంటీ పరిస్థితి అని ఆప్ సిగ్నేచర్ క్యాంపెయిన్‌ను గతంలో నిర్వహించింది. అందులో 90 శాతం మంది ముఖ్యమంత్రి జైలు నుంచే ఢిల్లీని పరిపాలిస్తారని చెప్పారు. దీంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా తమ అధినేత కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీని పాలిస్తారని అన్నారు. జైల్లోనే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి(Atishi Marlena) కూడా అన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకుండా అడ్డుకునే చట్టం ఏదీ లేదని వెల్లడించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయించుకున్నారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ కూడా స్పష్టం చేశారు.

నెక్ట్స్ సీఎం ఎవరు?

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ(aam aadmi party)లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ జైలులో ఉండటంతో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మాత్రమే ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ కూడా అధికారం చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీఎంగా ఉండగా అరెస్ట్ అయిన తొలి నేత

దేశంలోనే పదవిలో ఉండగానే అరెస్టయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్(arvind kejriwal) కావడం విశేషం. అయితే దీనికి ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఆయన కార్యాలయంలో ఉండగానే ఈడీ అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి, గవర్నర్‌కు రాజీనామా సమర్పించడానికి అవకాశం ఇచ్చింది.

]]>
https://kpsnetwork.in/22/03/2024/2827/feed/ 0 2827
సోషల్ మీడియా ప్రచారంలో ఈ పార్టీలే టాప్ https://kpsnetwork.in/19/03/2024/2818/ https://kpsnetwork.in/19/03/2024/2818/#respond Tue, 19 Mar 2024 05:19:15 +0000 https://kpsnetwork.in/?p=2818 KPS డిజిటల్ నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అంతకు ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారాల్లో ఎవరెరవరు ఎంతెంత ఖర్చు పెట్టారు అని చూస్తే అందరికంటే బీజేపీ, వైసీపీనే అని తేలింది. మెటా యాడ్ లైబ్రరీ ప్రకారం ఈ విరాలను సేకరించారు.

సోషల్ మీడియా(Social Media) ప్రజల జీవితంలో బాగం అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచీ రాత్రి పడుకునే వరకూ అన్ని విషయాలనూ జనాలు ఇందులో పంచుకుంటున్నారు. రాజకీయ పార్టీలు(Political Parties) కూడా సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటోంది. దీని ద్వారా అయితే ప్రజలను మరింత తొందరగా చేరుకుంటామనే ఉద్దేశంతో పార్టీలు సోసల్ మీడియాలో తెగ ప్రచారాలు చేస్తున్నారు. దాంతో పాటూ పక్క పార్టీలను విమర్శించడానికి, తిట్టడానికి కూడా ఉపయోగించుకుంటున్నాయి.

అయితే మెటా యాడ్ లైబ్రరీ(Meta Ad Library) డేటా ప్రకారం దేశంలో అందరి కంటే బీజేపీ(BJP) సోషల్ మీడియా యాడ్స్(Social Media Ads) కోసం ఎక్కువ ఖర్చు చేస్తోందని తేలింది. గడిచిన 90 రోజులను పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలను తెలిపింది. బీజేపీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ ప్రభుత్వమే ఈ ప్రచారాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతోంది. అయితే ఇందులో బీఆర్ఎస్(BRS) కానీ, కాంగ్రెస్(Congress) కానీ పెద్ద యాక్టివ్‌గా లేదని సర్వే చెబుతోంది. మెటా యాడ్ లైబ్రరీ ప్రకారం సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు అన్నీ ఒడిశా ప్రభుత్వం అందరి కంటే ఎక్కువగా 3.67 కోట్లు ఖర్చు పెడుతుండగా. ఉత్తరప్రదేశ్ 3.66 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ 3.60 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

బీజేపీనే టాప్..

ఇక దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ సోషల్ మీడియా రాజకీయ ప్రకటనల కోసం ఆరు కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా కేవలం గడిచిన 90 రోజుల్లో మాత్రమే. ఉల్తాచష్మా పేరుతో ₹2 కోట్లు, ఫిర్ ఎక్బర్ మోడీ సర్కార్ ₹1.9 అనే పేరుతో ఫేస్‌బుక్‌ పేజీకి వెచ్చించింది. ఇందులో ఉల్టా చష్మా ఫేస్‌బుక్ ప్రకటనలు ఎక్కువగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలను విమర్శించేవిగా ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో…

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఫేస్‌బుక్‌లో బీజేపీ ₹15 లక్షలు ఖర్చు చేసింది. మన మోదీ పేరుతో రూ.8 లక్షలు, MyGovIndia పేరుతో రూ.6 లక్షలు పెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో, జగనే కావాలి అనే పేరుతో ఒక ఫేస్‌బుక్ పేజీకి ₹39 లక్షలు ఖర్చు చేసింది వైసీపీ పార్టీ. జగనన్న సురక్ష యాడ్‌ కోసం 37 లక్షలు, జగనన్న తోడుగు యాడ్‌కు 29 లక్సలు ఖర్చు పెట్టింది.

]]>
https://kpsnetwork.in/19/03/2024/2818/feed/ 0 2818
రైలు ఢీకొని నలుగురి మృతి.. పట్టాలు దాటుతుండగా ప్రమాదం.. https://kpsnetwork.in/19/01/2024/2759/ https://kpsnetwork.in/19/01/2024/2759/#respond Fri, 19 Jan 2024 03:42:32 +0000 https://kpsnetwork.in/?p=2759 KPS డిజిటల్ నెట్‌వర్క్, జార్ఘండ్‌ :- జార్ఘండ్‌లో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా ..కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాలోని గమరియా స్టేషన్ వెలుపల ఈ ఘటన జరిగింది. బాధితులందరూ ఘటనా స్థలానికి సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నట్లు తెలిసింది. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

]]>
https://kpsnetwork.in/19/01/2024/2759/feed/ 0 2759
డేంజర్ జోన్‌లో భారత్ నగరాలు ! https://kpsnetwork.in/04/01/2024/2736/ https://kpsnetwork.in/04/01/2024/2736/#respond Thu, 04 Jan 2024 12:07:28 +0000 https://kpsnetwork.in/?p=2736 KPS డిజిటల్ నెట్‌వర్క్, ఢిల్లీ :- భూకంపాల చరిత్ర భారతదేశానికి కూడా ఉంది. మహారాష్ట్రలోని లాతూర్, గుజరాత్ లోని భుజ్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. అనేక గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇదిలాఉంటే మనదేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ డేంజర్ జోన్‌లో ఉన్నాయి. నిబంధనలను గాలికొదిలేసి ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించడం మానుకోవాలి.

భారత్‌ కూడా భూకంపాల బాధిత దేశమే. భూకంపం అనగానే మనదేశంలో ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది..భుజ్. 2001 జనవరి 26న యావత్ భారతదేశం రిపబ్లిక్ వేడుకలు చేసుకుంటున్న సమయంలోభుజ్ లో భూమి కంపించింది. కచ్ జిల్లా ఛోబారి గ్రామానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన భూకంప కేంద్రం ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 7.7 గా నమోదైంది. భుజ్ భూకంపంలో 20 వేలమందికిపైగా చనిపోయారు. లక్షా 67 వేల మంది గాయపడ్డారు. దాదాపు నాలుగు లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపంతో భుజ్‌ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. భుజ్ ఒక్కటే కాదు, కచ్ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించాయి.

భుజ్‌, లాతూర్ భూకంపాల సమాచారం అందిన వెంటనే భారత సైన్యం అప్రమత్తమైంది. హుటాహుటిన రంగంలోకి దిగింది. సహయక చర్యల్లో పాల్గొంది. బాధితులకు అండగా నిలిచింది. బాధితులను ఆదుకోవడానికి రెడ్ క్రాస్ సంస్థ కూడా ముందుకొచ్చింది. భుజ్‌లో యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రి నిర్మించింది. గాయపడ్డవారికి వైద్య సేవలు అందించిం ది. భుజ్ స్థాయిలో వచ్చిన మరో భూకంపం..లాతూర్. మహారాష్ట్రలోని లాతూర్ లో 1993 సెప్టెంబరు 30 న భారీ భూకం పం సంభవించింది. మరికొన్ని గంటల్లో తెల్లవారుతుందనగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. ఈ భూకంపం ఫలితంగాపదివేల మందికి పైగా ప్రజలు చనిపోయారు. ముప్ఫయి వేల మందికి పైగా గాయపడ్డారు.

భూకంప వార్త వినగానే షోలాపూర్ డాక్టర్లు బృందాలుగా లాతూర్ చేరుకున్నారు. గాయపడ్డవారికి వైద్య సాయం అందిం చారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే ఇండియన్ ఆర్మీ , మహారాష్ట్ర రిజర్వు పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీ సులతో పాటు మిగతా చారిటీ సంస్థలు స్పందించాయి. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించాయి. మనదేశం లో అనేక ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉంది. అగర్తలా, ఇంఫాల్, కొహిమా, అమృత్‌సర్ , ఢిల్లీ , మీరఠ్‌, పాట్నా, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని, ఎన్ జీ ఆర్ ఐ సైంటిస్టులు గతంలోనే హెచ్చరించారు. అంతేకాదు ఉత్తరాఖండ్‌ లోని జోషిమఠ్‌ పట్టణం కూడా ….. డేంజర్ లిస్టులో ఉందంటున్నారు సైంటి స్టులు. భూమి కుంగడం, పగుళ్ల కారణంగా కిందటేడాది జోషిమఠ్ పట్టణం వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. జోషి మఠ్ లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భూకంపాలను తట్టుకునే నిర్మాణాలపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే భూకంపాలు సంభ విస్తే వ్యవహరించాల్సిన తీరుపై కూడా ప్రజలకు అవగాహన అవసరం. ఈ విషయంలో జపాన్ మిగతా దేశాలతో పోలిస్తే చాలా ముందుంది. సహజంగా జపాన్ లో భూకంపాలు తరచుగా వస్తుంటాయి. దీంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించు కోవడానికి జపాన్ ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఇలాంటి ముందుచూపు భారత్ లో కనిపించడం లేదు. అందుకే జనసాంద్రత ఉన్న అనేక ప్రాంతాలు, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవటం, నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా భవంతుల నిర్మాణం చేయ డం ఇటీవల ఎక్కువైంది. ఇప్పటికైతే బండి నడవ్వొచ్చు కానీ ఏదో ఒక రోజు పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.ఏమైనా జపాన్ విపత్తు చూసి భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మనదేశం లోనూ భూకంపాలు సంభవించే ప్రాంతాలున్నాయి.వీటిమీద పాలకులు వెంటనే దృష్టి పెట్టాలి. నిబంధనలను గాలికొ దిలేసి ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించడం మానుకోవాలి. పర్యావరణవేత్తల సూచనలు పాటించాలి.లేదంటే, పర్య వసానాలు తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

]]>
https://kpsnetwork.in/04/01/2024/2736/feed/ 0 2736
అందరూ సంతోషంగా ఉండాలి … మీ కిరణ్ ..! https://kpsnetwork.in/01/01/2024/2732/ https://kpsnetwork.in/01/01/2024/2732/#respond Sun, 31 Dec 2023 19:12:44 +0000 https://kpsnetwork.in/?p=2732 KPS డిజిటల్ నెట్‌వర్క్, ఢిల్లీ :- దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మీ కంచారన కిరణ్ కుమార్ సార్క్ నేషన్స్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ , అధ్యక్షులు భారతీయ జర్నలిస్ట్ యూనియన్ , చైర్మన్ అండ్ ఎం.డీ కిరణ్ గ్రూప్ .

]]>
https://kpsnetwork.in/01/01/2024/2732/feed/ 0 2732
కరోనా కొత్త వేరియంట్.. కేంద్రం కీలక సూచనలు.. https://kpsnetwork.in/19/12/2023/2717/ https://kpsnetwork.in/19/12/2023/2717/#respond Mon, 18 Dec 2023 18:44:31 +0000 https://kpsnetwork.in/?p=2717 KPS డిజిటల్ నెట్‌వర్క్, ఢిల్లీ :- దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN-వన్ గుర్తించారు. దీంతో కేంద్రం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ వలన ఐదుగురు మృతి చెందారు. ఈ మృతుల్లో నలుగురు కేరళ వారు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని.. RT-PCR టెస్టులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. అలాగే పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్రం కోరింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.

కోవిడ్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి , సంబంధించిన టెస్టులు చేయించుకోవాలన్నారు. రాష్ట్రాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాలు,జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థతిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది .

]]>
https://kpsnetwork.in/19/12/2023/2717/feed/ 0 2717
శ్రీకృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. https://kpsnetwork.in/14/12/2023/2682/ https://kpsnetwork.in/14/12/2023/2682/#respond Thu, 14 Dec 2023 12:59:17 +0000 https://kpsnetwork.in/?p=2682 KPS డిజిటల్ నెట్‌వర్క్, అలహాబాద్‌ :- ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదానికి సంబంధించి అలహాబాద్‌ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్‌ని నియమించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే అలహాబాద్‌ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈద్గా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవ‌కాశాలు ఉన్నాయి.

షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమిషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఈ నెల 18న విధివిధానాలు నిర్ణయిస్తారని అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది.

షాహి ఈద్గా మ‌సీదును 17వ శ‌తాబ్ధంలో నిర్మించారు. కోర్టు నియ‌మించే కమిష‌న‌ర్ ఆధ్వర్యంలో స‌ర్వే చేప‌ట్టనున్నారు. శ్రీ కృష్ణుడు జ‌న్మించిన స్థలంలో ముస్లింలు మ‌సీదు నిర్మించిన‌ట్లు హిందూవాదులు ఆరోపిస్తున్నారు. హిందూ సేన‌కు చెందిన విష్ణు గుప్త స‌ర్వే కోసం డిమాండ్‌ చేశారు. విష్ణు గుప్త దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను స్థానిక కోర్టు గ‌త డిసెంబ‌ర్‌లో స్వీక‌రించింది. అయితే ఈద్గా తరపు న్యాయవాదులు అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

శ్రీకృష్ణ జ‌న్మస్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎక‌రాల భూమిపై హిందువుల‌కే హ‌క్కును క‌ల్పించాల‌ని హిందూసేన డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఉన్న కాట్ర కేశ‌వ దేవ్ ఆల‌యాన్ని కూల్చి.. దాని స్థానంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొఘ‌ల్ చ‌క్రవ‌ర్తి ఔరంగ‌జేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జ‌రిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

]]>
https://kpsnetwork.in/14/12/2023/2682/feed/ 0 2682