Warning: Cannot modify header information - headers already sent by (output started at /var/www/fastuser/data/www/kpsnetwork.in/index.php:1) in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/feed-rss2.php on line 8
క్రీడా వార్తలు – KPS NETWORK https://kpsnetwork.in Digital Media Thu, 23 Feb 2023 05:10:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://i0.wp.com/kpsnetwork.in/wp-content/uploads/2021/08/cropped-television-05-icon.png?fit=32%2C32&ssl=1 క్రీడా వార్తలు – KPS NETWORK https://kpsnetwork.in 32 32 196956755 టీమిండియా ఆటగాళ్ల జోరు.. ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన స్పిన్ ద్వయం https://kpsnetwork.in/23/02/2023/2367/ https://kpsnetwork.in/23/02/2023/2367/#respond Thu, 23 Feb 2023 05:10:30 +0000 https://kpsnetwork.in/?p=2367 ఢిల్లీ : ICC Test Rankings | ICC తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. బౌలర్ల విభాగంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin)రెండో ర్యాంకులో నిలిచాడు. కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా(Jadeja),అశ్విన్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అక్షర్ పటేల్ ఐదవ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు, ఏడవ స్థానాల్లో కొనసాగుతున్నారు.

]]>
https://kpsnetwork.in/23/02/2023/2367/feed/ 0 2367
అసలు హీరో శార్దూల్‌ ఠాకూర్‌.. నాకంటే అతనే అర్హుడు https://kpsnetwork.in/07/09/2021/1400/ https://kpsnetwork.in/07/09/2021/1400/#respond Tue, 07 Sep 2021 07:10:15 +0000 http://kpsnetwork.in/?p=1400 లండన్‌ : ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయం వెనుక జట్టు సమిష్టి కృషి ఉందనడంలో సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీకి ఎంత విలువ ఉందో.. శార్దూల్‌ ఠాకూర్‌ ట్విన్‌ హాఫ్‌ సెంచరీలకు అంతే ప్రాధాన్యం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. దీనిపై సోషల్‌ మీడియాలో అభిమానులు రెండుగా చీలిపోయారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ అర్హుడని కొందరు అంటే.. లేదు శార్దూల్‌కే ఆ అర్హత ఉందని మరికొందరు వాదించారు. ప్రస్తుతం ఇది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కన పెడితే రోహిత్‌ శర్మ తనకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రావడంపై మ్యాచ్‌ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.

”నాలుగో టెస్టులో అసలు హీరో శార్దూల్‌ ఠాకూర్‌. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నాకంటే శార్దూల్‌కు ఇచ్చి ఉంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. తొలి ఇన్నింగ్స్‌లో తామంతా బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు శార్దూల్‌ మాత్రం మెరుపు అర్థసెంచరీతో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అవుటైన తర్వాత పంత్‌తో కలిసి దాదాపు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే గాక మరో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్‌లోనూ తన సత్తా ఏంటో చూపించాడు.

100 పరుగుల వరకు వికెట్‌ నష్టపోకుండా పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను దెబ్బతీసి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. ఇలాంటి మొమరబుల్‌ ఇన్నింగ్స్‌ ఆడిన శార్దూల్‌కు ఇవే నా కృతజ్ఞతలు. అందుకే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు నాకంటే శార్దూల్‌కే ఎక్కువ అర్హతలున్నాయి. ఏది ఏమైనా నా దృష్టిలో నేను ఈ అవార్డును శార్దూల్‌తో పంచుకున్నా. ప్రస్తుతం ఫామ్‌ దృశ్యా అందరం అద్భుతంగా ఉన్నాం.. ఇక సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడం సంతోషంగా అనిపిస్తుంది. చివరి మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రతిభను కనబరిచి 3-1తో సిరీస్‌ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.దీనిని ఇలాగే కొనసాగిస్తాం.” అంటూ చెప్పుకొచ్చాడు.

]]>
https://kpsnetwork.in/07/09/2021/1400/feed/ 0 1400
కోహ్లి విషయంలో మొయిన్‌ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు https://kpsnetwork.in/06/09/2021/1377/ https://kpsnetwork.in/06/09/2021/1377/#respond Mon, 06 Sep 2021 06:04:57 +0000 http://kpsnetwork.in/?p=1377 లండన్‌ : టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆటలో తొలి రెండు రోజులు ఇంగ్లండ్‌ ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడు, నాలుగు రోజులు టీమిండియా ఆధిపత్యం కనబరిచింది. ఇక ఐదో రోజు ఇరు జట్లకు కీలకంగా మారింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి పది వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్‌ గెలుపుకు 291 పరుగుల దూరంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కొన్ని కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకసారి వాటిని పరిశీలిస్తే..

► విరాట్‌ కోహ్లిని ఔట్‌ చేయడం ద్వారా మొయిన్‌ అలీ కొత్త రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా మొయిన్‌ అలీ అన్ని ఫార్మాట్లు కలిపి కోహ్లిని ఇప్పటివరకు 10 సార్లు ఔట్‌ చేశాడు. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్‌ చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు టెస్టుల్లో ఆరుసార్లు కోహ్లిని అవుట్‌ చేశాడు. టెస్టుల్లో కోహ్లిని ఎక్కువసార్లు అవుట్‌ చేసిన జాబితాలో అలీ రెండో స్థానంలో ఉన్నాడు. జేమ్స్‌ అండర్సన్‌(ఇంగ్లండ్‌), నాథన్‌ లియాన్‌(ఆస్ట్రేలియా)లు కోహ్లిని ఏడేసి సార్లు ఔట్‌ చేసి తొలి స్థానంలో నిలిచారు.

► 21వ శతాబ్దంలో ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 400కు పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 2002లో నాటింగ్‌హమ్‌ టెస్టులో టీమిండియా 428 పరుగులు చేసింది.

► డకౌట్ల విషయంలో అజింక్యా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై మూడుసార్లు డకౌట్‌గా వెనుదిరిగిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రహానే నిలిచాడు. 2014, 2018లో ఇదే ఓవల్‌ మైదానంలో రహానే రెండుసార్లు డకౌట్‌ అయ్యాడు.

► ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా గడ్డపై వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆసియా ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకముందు ఆసియా నుంచి సచిన్‌, ద్రవిడ్‌లు మాత్రమే ఉన్నారు.

]]>
https://kpsnetwork.in/06/09/2021/1377/feed/ 0 1377
ఆటకు వర్షం ముప్పులేదు.. స్పిన్నర్లకు పండగే! అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే!! https://kpsnetwork.in/02/09/2021/1328/ https://kpsnetwork.in/02/09/2021/1328/#respond Thu, 02 Sep 2021 04:32:54 +0000 http://kpsnetwork.in/?p=1328 లండన్‌ : భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు ముగిసిన మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా ఉండగా.. మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్‌ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ నేపథ్యంలో ఓవల్‌ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం అయ్యే నాలుగో టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. లీడ్స్‌ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌ జట్టులో ఆత్మవిశ్వాసం పెరగ్గా.. గత మ్యాచ్‌ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్‌ దృష్టి పెట్టింది. కెన్సింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో టాస్ మధ్యాహ్నం 3 గంటలకు పడనుండగా.. మ్యాచ్ 3.30కి ఆరంభం కానుంది.

]]>
https://kpsnetwork.in/02/09/2021/1328/feed/ 0 1328
ICC టెస్టు ర్యాంకింగ్స్: ఆరో స్థానానికి పడిపోయిన కోహ్లీ https://kpsnetwork.in/01/09/2021/1310/ https://kpsnetwork.in/01/09/2021/1310/#respond Wed, 01 Sep 2021 10:21:25 +0000 http://kpsnetwork.in/?p=1310 ICC టెస్టు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేటెస్టుగా ర్యాంకులు విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానం నుంచి ఆరోస్థానానికి పడిపోయాడు. ఫామ్ లో ఉన్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపరుచుకుని ఐదోస్థానానికి చేరుకున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి జో రూట్ ICC ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు.

బౌలింగ్ ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ లిస్టులో ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఎలాంటి మార్పులేదు. టీమిండియాతో టెస్టు సిరీస్ లో సత్తా చాటుతున్న ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ‘ఆరు’ నుంచి ఐదోస్థానానికి చేరుకున్నాడు.

]]>
https://kpsnetwork.in/01/09/2021/1310/feed/ 0 1310
పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్ https://kpsnetwork.in/30/08/2021/1283/ https://kpsnetwork.in/30/08/2021/1283/#respond Sun, 29 Aug 2021 20:16:20 +0000 http://kpsnetwork.in/?p=1283 న్యూఢిల్లీ : అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున లాంగ్ జంప్ ఈవెంట్‌లో 17 ఏళ్ల షైలీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె మైమరిచి చిందేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షైలీ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన షైలీ.. నైరోబి ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో 6.59 మీటర్లు దూకి రజతం సాధించింది.

]]>
https://kpsnetwork.in/30/08/2021/1283/feed/ 0 1283
నేస్తమా త్వరగా కోలుకో..: సచిన్‌ https://kpsnetwork.in/29/08/2021/1176/ https://kpsnetwork.in/29/08/2021/1176/#respond Sun, 29 Aug 2021 09:33:58 +0000 http://kpsnetwork.in/?p=1176 ముంబై : న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ పక్షవాతం బారినపడ్డ సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్‌ రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోనే మరో ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా క్రిస్‌ కెయిన్స్‌ త్వరగా కోలుకోవాలంటూ బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

” గెట్‌ వెల్‌ సూన్‌ క్రిస్‌ కెయిన్స్‌.. నేస్తమా త్వరగా కోలుకో.. నీ ఆరోగ్యం తొందరగా బాగవ్వాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.” అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా 51 ఏళ్ల క్రిస్‌ కెయిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్‌ కివీస్‌ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్‌ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు.

]]>
https://kpsnetwork.in/29/08/2021/1176/feed/ 0 1176