Warning: Cannot modify header information - headers already sent by (output started at /var/www/fastuser/data/www/kpsnetwork.in/index.php:1) in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/feed-rss2.php on line 8
Crime News – KPS NETWORK https://kpsnetwork.in Digital Media Wed, 03 Apr 2024 03:56:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://i0.wp.com/kpsnetwork.in/wp-content/uploads/2021/08/cropped-television-05-icon.png?fit=32%2C32&ssl=1 Crime News – KPS NETWORK https://kpsnetwork.in 32 32 196956755 ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి https://kpsnetwork.in/03/04/2024/2846/ https://kpsnetwork.in/03/04/2024/2846/#respond Wed, 03 Apr 2024 03:56:11 +0000 https://kpsnetwork.in/?p=2846 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మహారాష్ట్ర :- మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఓ టైలరింగ్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పేశారు. ఆ కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు సమాచారం.

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం దాటికి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉదయం 4 గంటలకు టైలరింగ్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

పొగ పీల్చుకొని

అయితే ఈ ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం టైలర్‌ షాప్‌లో జరిగింది. మృతిచెందిన వారు పైఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే టైలర్‌ షాప్‌ అగ్ని ప్రమాదం జరిగాక.. దాని నుంచి వెలువడిన పొగ పీల్చుకొని ఆ కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్‌లో 50కి పైగా ఇళ్లు దగ్ధం

ఇదిలా ఉండగా.. బీహార్‌లో కూడా ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 50కి పైగా ఇళ్లు తగలబడ్డాయి. అలాగే ఓ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కొన్ని లక్షల ఆస్తి బూడిద పాలైయ్యింది. ఓ ఇంట్లోని తండ్రీ కొడుకులు పూర్తిగా కాలిపోయారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

]]>
https://kpsnetwork.in/03/04/2024/2846/feed/ 0 2846
ఆ డ్రగ్ కంటైనర్ ఏ పార్టీది? సీబీఐ ఏం చెబుతోంది? https://kpsnetwork.in/24/03/2024/2830/ https://kpsnetwork.in/24/03/2024/2830/#respond Sun, 24 Mar 2024 04:15:07 +0000 https://kpsnetwork.in/?p=2830 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- కాదేది కవితకనర్హం.. పాతమాట.. కాదేది రాజకీయానకనర్హం.. కొత్తమాట అని చెప్పలేం కానీ ప్రస్తుతం ఇదే ట్రెండ్.. కాదంటే విశాఖ కంటైనర్ డ్రగ్స్‌ ఇష్యూను అబ్జర్వ్‌ చేయండి.. అసలింతకి సీబీఐ ఆపరేషన్‌ గరుడ ఏంటి? సీల్ తీసిన కంటైనర్‌లో బయటపడ్డ డ్రగ్స్ ఎంత? డ్రగ్స్ తెప్పించిందిదెవరు? ఇప్పుడీ అంశం ఏపీ పాలిటిక్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? నిజంగానే ఈ డ్రగ్స్‌ ఏపీ ఎన్నికల ఫలితాలను షేక్ చేస్తాయా? సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ కంపెనీ బ్రెజిల్ నుంచి ఫీడ్ ఆర్డర్ చేసింది. జనవరి 14న అక్కడి నుంచి షిప్ బయల్దేరింది.

రెండు నెలల పాటు సముద్రంలో జర్నీ చేసింది. ఈ నెల 16న విశాఖ పోర్టుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో షిప్‌లోని ఓ కంటైనర్‌లో.. భారీగా డ్రగ్స్ ఉన్నట్టు ఇంటర్‌పోల్‌కు ఇన్ఫర్మేషన్‌ వెళ్లింది. ఆ ఇన్ఫర్మేషన్‌ ఇండియన్ ఏజెన్సీసీస్‌కు రావడం.. సీన్‌లోకి సీబీఐ ఎంటరవ్వడం.. ఆపరేషన్‌ గరుడను స్టార్ట్ చేసింది.. ఈ నెల 19న విశాఖలో ల్యాండయ్యింది సీబీఐ స్పెషల్ టీమ్.. కంటైనర్‌ను కస్టడీలోకి తీసుకుంది.టెస్ట్‌లు చేస్తే డ్రగ్స్‌ ఉన్న విషయం నిజమే అన్నది కన్ఫామ్ అయ్యింది.ఇక్కడ మొదలైంది రాజకీయ రగడ..

అసలు డ్రగ్స్ ఎవరు పంపారు? ఎవరికి పంపారు?ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది ఈ దందా? ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ అసలు కంటైనర్‌లోకి ఎలా చేరాయి? వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఎలా సప్లై చేద్దామనుకున్నారు? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే పనిలో ఉంది సీబీఐ.వచ్చింది బ్రెజిల్ నుంచి.. తీసుకొచ్చింది చైనా షిప్‌లో.. ఆర్డర్ ఇచ్చింది విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ.. కంపెనీ ఏమో 25 కేజీల చొప్పున ఉన్న వెయ్యిబస్తాల డ్రై ఈస్ట్ ఆర్డర్ ఇచ్చామంటోంది. అంతకుమించి తమకు ఏం తెలియదు.. ఇది కంపెనీ మాట.. NCB డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా టెస్ట్‌ చేస్తే.. అన్నింటిలోనూ కొకైన్, మెధాక్వలైన్ ఉన్నట్టు కన్ఫామ్ చేసింది సీబీఐ.. ఇక దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ షురూ చేసింది..

కానీ ఏపీ పొలిటికల్ లీడర్స్‌ సీబీఐ కంటే ఫాస్ట్ కాబట్టి.. ఈ డ్రగ్స్‌కు ఎవరికి సంబంధించినవో కనిపెట్టేశారు.. కంటైనర్ తెప్పించింది మీరంటే మీరని..అటు వైసీపీ, ఇటు టీడీపీ డైలాగ్‌ వార్‌, ట్వీట్‌ వార్ ప్రారంభించేశాయి. వైసీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్ర అధికారులు సీబీఐకు సహకరించడం లేదు. కంటైనర్‌ తెరవకుండా ఉండేందుకు ప్రయత్నించారు.. ఇది టీడీపీ నేతల మాటలు..

దీనికి కౌంటర్‌గా వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.. కంటైనర్ డెలివరి తీసుకున్న కంపెనీకి పురంధేశ్వరి బంధువులకు సంబంధాలు ఉన్నాయి.. టీడీపీ నేతలు కావాలనే తఆరోపణలు చేస్తున్నారు..
డ్రగ్స్‌ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి.. తప్పు చేసి రివర్స్‌లో తమపైనే ఆరోపణలు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే డ్రగ్స్‌కు టీడీపీ నేతలకే లింకులు ఉన్నాయి. ఓటర్లకు డబ్బులు పంచడానికే ఈ డ్రగ్స్ తెప్పించారు. సంధ్య కంపెనీపై గతంలోనే కేసులు పెట్టాం. ఇది వైసీపీ వర్షన్..

అసలు కేసు విచారణ తేలకముందే ఒకరిపై ఒకరు విమర్శలు వర్షం కురిపించుకుంటున్నారు ఏపీ నేతలు.. వైజాగ్‌ పోలీసులేమో సీబీఐ అధికారులకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాం.. తమపై లేనిపోని ఆరోపణలు వద్దు అంటున్నారు..

ఇలా ఎవరి వర్షన్ ఎలా ఉన్నా.. కథంతా సంధ్యా ఆక్వా కంపెనీ చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ డైరెక్టర్‌, ప్రతినిధులను సీబీఐ టీమ్ క్వశ్చన్ చేసింది. కానీ సరైన సమాధానాలు రాలేదని సీబీఐ టీమ్..
తాము మాత్రం ఆక్వా ఫుడ్‌ను మాత్రమే ఆర్డర్‌ చేశామని చెబుతోంది కంపెనీ. అందరు దొరలే అయితే.. గుమ్మడికాయలను ఎత్తుకెళ్లింది ఎవరు? డ్రగ్స్‌ ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? ఎవరు తెప్పించారు? ఎక్కడికో వెళ్లాల్సిన కంటైనర్.. దారి తప్పి వైజాగ్‌కు వచ్చిందా? ఈ ప్రశ్నలకు సీబీఐ సమాధానం కనుగొనేలోపు.. ఏపీలో పార్టీల సిగపట్లు పీక్స్‌కు చేరడం మాత్రం ఖాయం.

]]>
https://kpsnetwork.in/24/03/2024/2830/feed/ 0 2830
కొలిక్కి వస్తున్న విశాఖ ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు https://kpsnetwork.in/06/02/2024/2800/ https://kpsnetwork.in/06/02/2024/2800/#respond Tue, 06 Feb 2024 04:24:02 +0000 https://kpsnetwork.in/?p=2800 KPS డిజిటల్ నెట్‌వర్క్, విశాఖ :- విశాఖలో సంచలనం సృష్టించిన తహసీల్దారు రమణయ్య హత్య నిందితుడు దొరికాడు. రమణ్యను హత్య చేసిన వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు. మధురవాడలోని జెవెల్‌ పార్కు భూ వివాదమే కారణంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.

నాలుగు రోజుల క్రింత విశాఖ ను ఉలిక్కిపడేలా చేసిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు కొలిక్కివస్తోంది. నిందితుడు గంగాధర్‌ను చెన్నై ఎయిర్ పోర్ట్‌లో పట్టుకున్నారు. మధురవాడలోని జెవెల్‌ పార్కు భూ వివాదమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ పార్కు ప్లాట్లు ఉన్న స్థలానికి సంబంధించి.. కన్వేయన్స్ డీడ్ కోసం ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దీని కోసం రమణయ్యకు నిందితుడు 57 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం.

చెన్నైలో పట్టుబడ్డ నిందితుడు..

అయితే రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లాకు బదిలీ కావడం, పాత తేదీలతో సంతకాలు పెట్టేందుకు తిరస్కరించడంతోనే కక్షగట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ కు చెందిన గంగాధర్‌ నిందితుడని పోలీసులు శనివారమే నిర్ధారణకు వచ్చారు. విశాఖలో మర్డర్ చేశాక అతడు బెంగళూరు నుంచి చెన్నై లేదా గోవా వెళ్లి ఉంటాడని భావించి ఆ దిశగా పోలీసు బృందాలను పంపారు. సుబ్రహ్మణ్యం స్నేహితులతో అతనికి ఫోన్లు చేయించి, కూపీ లాగారు. చివరకు చెన్నై లో పట్టుకున్నారు. అతడిని ప్రస్తుతం ఎగ్మోర్‌ స్టేషన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

వైఫల్యం మీద విచారణ…

అయితే హత్య జరగిన రోజు నిందితుడు గంగాధర్‌ మధ్యాహ్నం 12 వరకు వైజాగ్‌లోనే ఉన్నాడు. ఆ తరువాత ఫ్లైట్‌లో బెంగళూరు…ఆ తర్వాత చెన్నై పారిపోయాడు. నిందితుడు విమానాశ్రయంలో ఉండగా గుర్తించకపోవడం మీద సీపీ రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారంటూ అధికారుల మీద మండిపడ్డట్లు తెలుస్తోంది. ఈ వైఫల్యం మీద సీపీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.

]]>
https://kpsnetwork.in/06/02/2024/2800/feed/ 0 2800
విశాఖ నడిబొడ్డులో దారుణం.. రూరల్ ఫస్ట్ మెజిస్ట్రేట్ దారుణ హత్య https://kpsnetwork.in/03/02/2024/2795/ https://kpsnetwork.in/03/02/2024/2795/#respond Sat, 03 Feb 2024 03:32:45 +0000 https://kpsnetwork.in/?p=2795 KPS డిజిటల్ నెట్‌వర్క్, విశాఖ :- ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ లో మండల మెజిస్ట్రేట్ హత్య.. అలా అని ఏ మారుమూలనో.. నిర్మానుష్య ప్రాంతలోనో కాదు. నిత్యం రద్దీగా ఉండే కొమ్మాదిలో జరిగిందీ ఘటన. కొమ్మాది అంటే నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. విద్యాసంస్థలు, చిన్నచిన్న వ్యాపార స్థావరాలు, అపార్ట్‌మెంట్‌లు.. ఇలా రద్దీగా ఉన్న ప్రాంతంలో తహసీల్దార్ రమణయ్య ఇంట్లోకి దుండగులు ధైర్యంగా వెళ్లి.. చంపి దర్జాగా తిరిగొచ్చారు.

ఇది ల్యాండ్ మాఫియా పనిగా తెలుస్తోంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రమణయ్య ఇంట్లోకి చొరబడి రాడ్‌లతో దాడి చేశారు. దీంతో తహసీల్దార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ని రంగంలోకి దించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. సుమారు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఫోన్ రావడంతో తహసీల్దార్ ఫ్లాట్ నుంచి కిందకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్ డిస్కషన్ జరిగింది. తర్వాత తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో ఆ వ్యక్తి తహసీల్దార్ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను బంధువులు వెంటనే అపోలో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ రమణయ్య ఆస్పత్రిలో మృతి చెందాడు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో పోలీస్ కమిషనర్ రవిశంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. ల్యాండ్ ఇష్యూలో బాగంగా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన తహసిల్దార్ రమణయ్య ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పనిచేశారు. రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేదాని కంటే ఇప్పుడు.. విశాఖలో పోలీసుల పనితీరు, ప్రజల రక్షణపైనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక ప్రభుత్వాధికారికే రక్షణ కరువైనపుడు.. ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ చెబుతారు. దాంతో పాటు.. విశాఖలో ల్యాండ్ మాఫియా ఆగడాలు గురించి కూడా తరచూ వార్తలు వింటూ ఉంటాం. కానీ.. ఈ రెండింటిలో విశాఖ పేరు బాగా వినిపించింది మాఫియా ఆగడాల ద్వారానే. ఇప్పుడు ఈ ఘటనతో మరోసారి భూదందాలకు అడ్డగా విశాఖ మారిందనడాన్ని రుజువు చేసింది.

]]>
https://kpsnetwork.in/03/02/2024/2795/feed/ 0 2795
రైలు ఢీకొని నలుగురి మృతి.. పట్టాలు దాటుతుండగా ప్రమాదం.. https://kpsnetwork.in/19/01/2024/2759/ https://kpsnetwork.in/19/01/2024/2759/#respond Fri, 19 Jan 2024 03:42:32 +0000 https://kpsnetwork.in/?p=2759 KPS డిజిటల్ నెట్‌వర్క్, జార్ఘండ్‌ :- జార్ఘండ్‌లో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా ..కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాలోని గమరియా స్టేషన్ వెలుపల ఈ ఘటన జరిగింది. బాధితులందరూ ఘటనా స్థలానికి సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నట్లు తెలిసింది. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

]]>
https://kpsnetwork.in/19/01/2024/2759/feed/ 0 2759
వివేక కుమార్తె సునీతకు పోలీసులు నోటీసులు .. ఎందుకంటే..? https://kpsnetwork.in/30/12/2023/2726/ https://kpsnetwork.in/30/12/2023/2726/#respond Sat, 30 Dec 2023 15:45:44 +0000 https://kpsnetwork.in/?p=2726 KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్‌ :- వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి.. పులివెందుల పోలీసులు నోటీసులు పంపించారు. ఇందులో భాగంగా అప్పటి CBI ఎస్పీ రామ్‌సింగ్‌కూ నోటీసులు పోస్టు ద్వారా అందించారు. వివేకా హత్య కేసులో ఆయన పీఏ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా.. ముగ్గురికి 41-ఏ నోటీసులను పంపారు.

ముగ్గురుపైనా పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 15న ముగ్గురుపై వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోపిన అభియోగాలపై విచారణకు రావాల్సి ఉందంటూ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఛార్జి షీటు కూడా దాఖలు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. ఈ మేరకు ముగ్గురికి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

]]>
https://kpsnetwork.in/30/12/2023/2726/feed/ 0 2726
నర్సింగ్‌ విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. కళాశాల ఛైర్మన్‌ అరాచకం.. https://kpsnetwork.in/06/06/2023/2509/ https://kpsnetwork.in/06/06/2023/2509/#respond Tue, 06 Jun 2023 06:35:57 +0000 https://kpsnetwork.in/?p=2509 KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో నర్సింగ్ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా క్లాసుల పేరుతో కాలేజ్ ఛైర్మన్ కమ్ ప్రిన్సిపల్ వేధిస్తున్నారని, అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో విజయవాడ కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

రా త్రి 11 గంటలకు తరగతులు ఉన్నాయంటూ ప్రిన్సిపల్ రమ్మంటున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శరీరంపై టచ్ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. ఆరోగ్యం బాగలేకున్నా.. కనీసం ఇంటికి ఫోన్‌ చేసేందుకు కూడా అనుమతించేవాళ్లు కాదన్నారు.

ప్రిన్సిపల్‌గా, ఛైర్మన్‌గా రవీంద్రరెడ్డే ఉండటం, అతని చేతిలో ఇంటర్నల్‌ మార్కులు ఉండటంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదన్నారు. రెండేళ్ల క్రితం సీనియర్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసి, అదే పరిస్థితి తమకూ ఎదురవుతుందనే భయంతో కళాశాల నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ మధ్యే మరో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆందోళన చేసినట్లు చెప్పారు.

కడప జిల్లా బద్వేలుకు చెందిన బసిరెడ్డి రవీంద్రరెడ్డి అంబాపురంలో నర్సింగ్ కాలేజ్ నడువుతున్నారు. భద్రాచలం, నూజివీడు, విస్సన్నపేట, తిరువూరు ప్రాంతాలకు చెందిన 83 మంది విద్యార్థినులు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. తమతో రవీంద్రరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బీఎస్సీ ఫస్టియర్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. టీసీలు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. కొందరు సర్టిఫికెట్లు తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బసిరెడ్డి రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

]]>
https://kpsnetwork.in/06/06/2023/2509/feed/ 0 2509
ఇంట్లోనే భర్తకు దహన సంస్కారాలు చేసిన భార్య https://kpsnetwork.in/29/05/2023/2502/ https://kpsnetwork.in/29/05/2023/2502/#respond Mon, 29 May 2023 08:49:16 +0000 https://kpsnetwork.in/?p=2502 KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండలో విషాద ఘటన జరిగింది. ఇంట్లోనే భర్తకు భార్య దహన సంస్కారాలు చేయడం సంచలనం రేపింది. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌(60) స్థానికంగా మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డారు. సోమవారం ఉదయం హరికృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. అయితే కుమారులు తమను సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ దగ్గరికి వస్తున్నారని భార్య లలిత తెలిపారు. అందుచేత తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారనే కారణంతో ఇంట్లోనే భర్తకు దహన సంస్కారాలు పూర్తిచేసినట్లు ఆమె తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

]]>
https://kpsnetwork.in/29/05/2023/2502/feed/ 0 2502
లేడీ సింగం మృతిపై అనుమానాలు.. ఆడియో, వీడియో క్లిప్పులు వైరల్‌ https://kpsnetwork.in/19/05/2023/2495/ https://kpsnetwork.in/19/05/2023/2495/#respond Fri, 19 May 2023 04:29:09 +0000 https://kpsnetwork.in/?p=2495 KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: లేడీ సింగంగా పేరు పొందిన అస్సాం పోలీసాఫీసర్ జున్ముణి రాభా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై అనుమనాలు వ్యక్తం చేస్తున్న ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడం కలకలం రేపుతోంది. పోలీసు శాఖలోని కొందరు అధికారులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపారని పేర్కొంటున్న ఓ కానిస్టేబుల్‌ ఆ ఆడియో క్లిప్‌ విడుదల చేశాడు. మరోవైపు ప్రమాద సమయంలో రాభా వాహనం ట్రక్కును ఢీకొనలేదని ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఆమె కారు నిలిపే ఉందని, ట్రక్కు వచ్చి వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని తెలిపాడు. అయితే ట్రక్కు ఢీకొట్టే ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారన్నాడు. ఇప్పటికే రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

]]>
https://kpsnetwork.in/19/05/2023/2495/feed/ 0 2495
అమెరికా కాల్పుల ఘటనలో తెలుగమ్మాయి మృతి.. హైదరాబాద్ లో విషాదం.. https://kpsnetwork.in/08/05/2023/2487/ https://kpsnetwork.in/08/05/2023/2487/#respond Mon, 08 May 2023 04:33:14 +0000 https://kpsnetwork.in/?p=2487 KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: శనివారం అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి దుర్మరణం చెందింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి(27) దుండగుడి తూటాలకు బలైపోయింది. అమెరికాలోని పర్ఫెక్ట్ జనరల్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఐశ్వర్య విధులు నిర్వర్తిస్తోంది. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐశ్వర్యరెడ్డితో సహా మొత్తం 8మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మాల్ దగ్గరకు కారులో వచ్చిన దుండగుడు లోపలికి చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దంతో భయభ్రాంతులైన వందలాది మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఇంకొంత మంది మాల్‌లోనే దాక్కున్నారు. మృతుల్లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

]]>
https://kpsnetwork.in/08/05/2023/2487/feed/ 0 2487