Warning: Cannot modify header information - headers already sent by (output started at /var/www/fastuser/data/www/kpsnetwork.in/index.php:1) in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/feed-rss2.php on line 8
Hot News – KPS NETWORK https://kpsnetwork.in Digital Media Thu, 02 May 2024 18:55:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://i0.wp.com/kpsnetwork.in/wp-content/uploads/2021/08/cropped-television-05-icon.png?fit=32%2C32&ssl=1 Hot News – KPS NETWORK https://kpsnetwork.in 32 32 196956755 ముత్తుకుమిల్లి భరత్ సోదరుడు ముత్తుకుమిల్లి వెంకటరాయుడు … ని కలసిన కంచారణ కిరణ్ కుమార్ https://kpsnetwork.in/03/05/2024/2922/ https://kpsnetwork.in/03/05/2024/2922/#respond Thu, 02 May 2024 18:52:56 +0000 https://kpsnetwork.in/?p=2922 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు విశాఖపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముత్తుకుమిల్లి భరత్ సోదరుడు ముత్తుకుమిల్లి వెంకటరాయుడు గారు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు ఆయనకి పుష్ప గుచ్చాలను అందజేషి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా కిరణ్ మాట్లడుతూ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రజలు కు మరింత సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను అని తెలిపారు.

రాష్ట్రాన్ని రావణ కాష్టం నుంచి వైదోలగించి రామ రాజ్య స్థాపనకు కృషి చేయాలి

రాష్ట్ర రాజకీయల నుంచి వైసీపీని పారద్రోలాలీ

రాష్ట్రాన్ని రావణ కాష్టం నుంచి వైదోలగించి రామ రాజ్య స్థాపనకు కృషి చేయాలి విశాఖపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముత్తుకుమిల్లి భరత్ సోదరుడు ముత్తుకుమిల్లి వెంకటరాయుడు అన్నారు.50వ వార్డులో గల మురళీ నగర్,మాధవధార,వంశీ నగర్, తేన్నేటి నగర్,మాన్యం,నరసింహ నగర్ ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు మద్దత్తుగా సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపి,బీజేపీ మరియు జనసేన పార్టీలు బలపరిచిన ఏమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజుకు,ఎమ్ పి అభ్యర్థి శ్రీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికీ వెళ్లి పర్యటించారు.ఈ సందర్బంగా ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ అంశాలను ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈరోజు మ్యానిఫెస్టోతో జగన్ రాజకీయ అస్త్రసన్యాసం చేశాడు.మా సూపర్ హిట్ సూపర్ సిక్స్ ముందు జగన్ రెడ్డి మ్యానిఫెస్టో వెలవెలబోయింది. హామీలను అమలుచేయడం తన వల్లకాదని జగన్ చేతులెత్తేశాడని వరప్రసాద్ అన్నారు.

జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. వచ్చేనెల 13న సైకో జగన్ ఇంటికి పోవడం ఖాయం. దోచుకోవాల్సిందంతా దోచుకుని, దాచుకున్నాక జగన్ చేతులెత్తేశాడు. కురుక్షేత్ర యుద్దం మే13 న జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో కౌరవ వధ జరుగుతుంది,ఎన్నికల్లో విజయదుందుభి మోగించి కౌరవసభను గౌరవసభగా మారుస్తాం అని అన్నారు.ఈ సందర్బంగా ప్రజలు నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూన వెంకట్రావు,జనసేన వార్డు ఆధ్వర్యంలో సనపల శివ సాగర్,బీజేపీ నాయకులు సనపల రామకృష్ణ,తెలుగుదేశం నాయకులు పైడి పుణ్యవతి,సనపల రామచంద్ర రావు,అరుణ్,నంబాళ్ల సత్యనారాయణ,నంబాళ్ల నాగరాజు,చౌదరి నరసింహం,చౌదరి లక్షణ్,పప్పల గౌరీ,నాగన్న,చక్రి,ఆర్ ఈశ్వర్ రావ్,శేఖర్,కనకమ్మ,పెంటకోట శ్రీనివాస్,చంద్ర శేఖర్ రాజు,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

]]>
https://kpsnetwork.in/03/05/2024/2922/feed/ 0 2922
జ‌గ‌న్ రోడ్ షో అట్టర్ ఫ్లాప్? https://kpsnetwork.in/24/04/2024/2909/ https://kpsnetwork.in/24/04/2024/2909/#respond Wed, 24 Apr 2024 03:24:55 +0000 https://kpsnetwork.in/?p=2909 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- వైజాగ్‌ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటున్న సీఎం జగన్ అదే వైజాగ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. అన్ని జిల్లాల్లో అభ్యర్ధులను పరిచయంచేస్తూ మేమంతా సిద్దం సభల్లో పాల్గొని ప్రసగిస్తూ వచ్చిన జగన్ విశాఖలో మాత్రం పరిచయకార్యక్రమాల జోలికి వెళ్లేలేదు. కనీసం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించలేదు. కేవలంలో బస్సులో కూర్చుని చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. అదే సాగరతీరంలోని వైసీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపుతోందంట.

ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్‌షోతో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారంట. రోడ్‌షో మొత్తం నమస్కారాలు, చేతులు ఊపడంతోనే సీఎం జగన్‌ ముగించేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి రోడ్‌షో నిర్వహించడంతో పాటు మేమంతా సిద్ధం పేరిట ఏర్పాటుచేసిన సభల్లో పాల్గొన్నారు. ఆ జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, గెలిపించాల్సిందిగా కోరారు. కానీ విశాఖలో లో అందుకు భిన్నంగా వ్యవహరించడం పార్టీ వర్గాలతోపాటు ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్‌రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో వేపగుంట జంక్షన్‌ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్కడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. ఆయా నియోజకవర్గాల్లో రోడ్‌షో చేస్తున్నప్పుడు కనీసం అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థిని పరిచయం చేసే ప్రయత్నం చేయకపోవడంపై పార్టీ నేతల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బస్సు యాత్రలో భాగంగా జగన్‌ ప్రతి జిల్లాలో ఏదో ఒకచోట సభలో పాల్గొన్నారు. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, వారిని పొగుడుతూ ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి జిల్లాలో కూడా సభ నిర్వహించడంతోపాటు పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. అలాంటిది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తానంటున్న విశాఖ నగరంలో మాత్రం ఎక్కడా ఒక సభ కూడా ఏర్పాటుచేయకపోవడం, నగర పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులను కనీసం పరిచయం చేయకుండానే బస్సు యాత్రను ముగించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసిందంట. జనాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో సీఎం నిరుత్సాహానికి గురై ఉంటారని, అందుకే మొక్కుబడిగా రోడ్‌షో ముగించేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా పరిణానాలు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోందని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తున్నారని తెలిసి నగర పరిధిలో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల నుంచి సీఎం జగన్‌ రోడ్‌షోకు ఆశించిన స్థాయిలో ఆదరణ కానరాకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆదివారం రాత్రి విశాఖలోని ఎండాడ కూడలిలో యాత్ర ముగించుకున్న జగన్ మధురవాడ ఐటీహిల్స్‌ సమీపంలో బస చేసేందుకు శిబిరానికి చేరుకున్నారు.

రోజంతా శిబిరంలోనే గడిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావులు జగన్‌ను కలిశారు. విశాఖ టూర్లో చోటు చేసుకున్న పరిణామాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. ముత్తంశెట్టి బయటకు వెళ్లిపోయాక సుబ్బారెడ్డి మాత్రం 3గంటల పాటు జగన్‌ వద్దే ఉండటంతో వైసీపీ నేతల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి నామినేషన్‌ వేయడానికి వెళ్లేముందు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యులతో జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రోజంతా శిబిరంలో ఉన్న జగన్‌ కొద్దిమంది నాయకులనే కలవడం సుబ్బారెడ్డితో సుదీర్ఘంగా భేటీ అవ్వడం విశాఖ రోడ్ షో ఎఫెక్టే అంటున్నారు.

]]>
https://kpsnetwork.in/24/04/2024/2909/feed/ 0 2909
కడప రాజకీయం.. వివేకా చుట్టే https://kpsnetwork.in/22/04/2024/2881/ https://kpsnetwork.in/22/04/2024/2881/#respond Mon, 22 Apr 2024 07:55:13 +0000 https://kpsnetwork.in/?p=2881 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కడప :- ఆంధ్రప్రదేశ్‌లో వైనాట్ 175 అంటూ సింగిల్‌గా పోటీ చేస్తోంది వైసీపీ టిడిపి, బీజేపీ, జనసేన పొత్తుల ఎత్తులను ఒంటరిగా ఎదుర్కొంటున్న జగన్‌కు ఆ పోరు కంటే కుటుంబ పోరు తలనొప్పిగా తయారైందంటున్నారు. చెల్లెల్లు షర్మిల, సునీత చేస్తున్న విమర్శలతో సీఎం పరిస్థితి సెన్సిటివ్‌గా మారిందంటున్నారు. సిస్టర్స్‌పై డైరెక్ట్‌గా అటాక్ చేయలేక పార్టీ నేతలతో మాట్లాడించాల్సి వస్తుంది ఆయనకి. ఆ క్రమంలో అసలింతకీ వైయస్ కుటుంబంలో జరుగుతుంది ఆస్తుల వివాదమా? రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటమా? అసలా కుటుంబంలో మిగిలిన ముఖ్య బంధువులు ఏమంటున్నారు?

వైఎస్ కుటుంబంలో మొదలైన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సీఎం జగన్‌లను టార్గెట్ చేస్తూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, డాక్టర్ వైఎస్ సునీతలు చేస్తున్న విమర్శలు కాక రేపుతున్నాయి. కడప జిల్లాలో వైఎస్ వివేకా హత్య చుట్టూ రాజకీయం తిరుగుతూ వివేకా కుమార్తె సునీత ఎన్నికల ప్రచారంలో షర్మిలకు మద్దతు ప్రకటిస్తుండటం.. రాజకీయం వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తుంది.

వైఎస్ ఫ్యామిలీలో అన్నతమ్ములు ఒకవైపు అక్క చెల్లెళ్లు ఒకవైపు అన్నట్లు విడిపోయి చేస్తున్న రాజకీయంతో జిల్లాలో సమీకరణలు మారిపోతున్నాయి. సోదరులపై యుద్దం ప్రకటించి కడప ఎంపీ అభ్యర్ధి షర్మిల, సునీతలు న్యాయం కోసం ధర్మం కోసం అండగా ఉండాలని కొంగు పట్టి అభ్యర్ధిస్తుండటం వైఎస్ అభిమానులను ఆలోచనలో పడేస్తోందంట. ముఖ్యమంత్రి కాకముందు జగనన్న వేరు ఇప్పుడు జగనన్న వేరు అని షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. వివేకా హత్యపై షర్మిల చేస్తున్న ప్రకటనలు, జగన్ పాలనపై ఆమె చేస్తున్న విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.

అయితే జగన్‌ని షర్మిల, సునీతలు టార్గెట్ చేస్తున్న తీరును కుటుంబసభ్యులు ఖండిస్తున్నారు. వైయస్ కుటుంబ పరువును రోడ్డున పెడుతున్నారని జగన్ మేనత్త విమలా రెడ్డి ఇటీవల షర్మిల, సునీతలపై ఫైర్ అయ్యారు. కేవలం ఆస్తులు కోసం షర్మిల అన్న జగన్ పై ఇలా చేయడం సరికాదనే వాదనను వినిపించారు విమలా రెడ్డి.ఇప్పటికే మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సైతం ఆ అక్కచెల్లెల్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.

జగన్ వ్యతిరేకుల కుట్రలో షర్మిల, సునీత పావులుగా మారారని జగన్ అనుకూల కుటుంబ సభ్యులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి వాదనలు తమకు అనుకూల వాతావరణం కల్పిస్తాయో? లేదో అన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉందంట. తన చిన్నాన్న హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిపై పోటీ చేస్తున్న షర్మిల ప్రచారంలో చూపిస్తున్న దూకుడు ఆ రేంజ్లో ఉందంటున్నారు.

జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి పదేపదే తన చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది అవినాష్ రెడ్డే అని ఆరోపిస్తున్నారు. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయించడానికి వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్‌బాబు కడప జిల్లా కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వివేకా హత్య ప్రస్తావన ఎత్తకూడదని కోర్టు షర్మిల, సునీతలతో పాటు ప్రతిపక్షనేతలను ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిస్తానంటున్నారు సునీత హత్యజరిగి అయిదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తునే ఉన్నారు.

కొద్దీ రోజుల క్రితం ప్రచారంలో భాగంగా పులివెందుల కేంద్రంగా వివేకా కుమార్తె సునీత చేసిన సవాల్ స్థానికంగా పెద్ద సంచలనమే రేపింది. అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని పులివెందుల పూల అంగళ్ళ వద్ధ చర్చకు సిద్ధమా అంటూ సునీత చేసిన సవాల్‌పై మేనత్త విమలా రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. కుటుంబ ఆడబిడ్డలు కుటుంబ పరువును బజారున పెడుతున్నారని షర్మిల కొంగు పట్టుకొని ఓట్లు అడుక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా షర్మిల, సునీత విమర్శలను అటు బంధుగణం, ఇటు వైసీపీ నేతలు తిప్పికొడుతున్నా ఆ విమర్శల ప్రభావం అధికార పార్టీకి కొంత నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ అభిమానుల్లో వివేకానందరెడ్డికి ఉన్న గుడ్ విల్‌తో వైసీపీ అంతో ఇంతో డ్యామేజ్ తప్పదంటున్నారు. మరి ఈ ఫ్యామిలీ వార్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

]]>
https://kpsnetwork.in/22/04/2024/2881/feed/ 0 2881
ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు https://kpsnetwork.in/12/04/2024/2874/ https://kpsnetwork.in/12/04/2024/2874/#respond Fri, 12 Apr 2024 06:36:15 +0000 https://kpsnetwork.in/?p=2874 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తెలంగాణ :- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా పెట్టిందని విచారణలో తెలిసింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టారని విచారణలో తెలిసింది. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయించిందని సమాచారం.2018 నుంచి రేవంత్‌రెడ్డిపై BRS ప్రభుత్వం నిఘా పెట్టిందని నిందితులు విచారణలో తెలిపారు. ఇంటలిజెన్స్‌ ఆధ్వర్యంలో రేవంత్‌ కోసం స్పెషల్‌ టీమ్‌ కూడా ఏర్పాటు చేశారుట.

SEBలోని 25 మంది అత్యంత నమ్మకస్థులైన,మెరికల్లాంటి పోలీసు ఆఫీసర్లతో నిఘా బృందాన్ని బీఆర్ఎస్ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.బీఆర్ఎస్‌కు చెందిన ఒక నేత ఇంట్నే ఈ మొత్తం నిఘా వ్యవస్థను పెట్టారని చెబుతున్నారు. రేవంత్‌ ఇంటిపైనా అధికారులు నిఘా పెట్టారని సమాచారం.రేవంత్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎవర్ని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఆర్థికసాయం చేస్తోందెవరు? అన్న విషయాలన్నీ కూపీలు లాగేవారు నిఘా టీమ్.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు రేవంత్‌పై ఈ నిఘా కొనసాగించదని తెలుస్తోంది.

ఇక సీఎం రేవంత్‌తో పాటు మరికొందరు ప్రతిపక్ష నాయకులపైనా బీఆర్ఎస్ నిఘా పెట్టిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసుల కస్టడీలో ఉన్న రాధాకిషన్‌ రావు స్టేట్‌మెంట్‌ ఆధారంగా..త్వరలోనే రాజకీయ నాయకులకూ నోటీసులు పంపిస్తామని చెబుతున్నారు పోలీసులు.మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తులు చేస్తున్నామని తెలిపారు.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) నిందితుడు రాధాకిషన్‌రావు(Radhakishan Rao) మీద మరిన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వెనకు చాలానే నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. తాజాగా క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్‌లో ఒకరైన వేణుమాధవ్..రాధాకిషన్‌రావు మీద కంప్లైంట్ చేశారు. తనను కిడ్నాప్ చేసి కోట్లు విలువైన షేర్లు బదిలీ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక్క రాధాకిషన్‌రావు మీదనే కాక మొత్తం టీమ్ మీద ఫిర్యాదు చేశారు. దీంతో రాధాకిషన్‌తోపాటు ఇన్‌స్పెక్టర్లు గట్టుమల్లు, మల్లికార్జున్‌ సహా 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

]]>
https://kpsnetwork.in/12/04/2024/2874/feed/ 0 2874
మంగళగిరి లో గెలుపెవరిది.. https://kpsnetwork.in/11/04/2024/2870/ https://kpsnetwork.in/11/04/2024/2870/#respond Thu, 11 Apr 2024 11:24:34 +0000 https://kpsnetwork.in/?p=2870 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మంగళగిరి :- కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పొలిటికల్‌గా అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తుంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ రెండో సారి అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మంగళగిరిలో లోకేశ్‌ను రెండో సారి కూడా ఓడిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే లోకేశ్ ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా మంగళగిరిలోనే తిష్ట వేసి ఇంటింటికి తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సారి జనసేన, బీజేపీలతో పొత్తు, వైసీపీలో విభేదాలు తనకు కలిసి వస్తాయన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. లోకేశ్ మరోసారిజగన్ స్లోగన్ వైనాట్ 175లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలే అని వైసీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్‌ను ఓడించి తీరుతామని ఛాలెంజ్‌లు చేస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేశ్ ఈ సారి నియోజవర్గం మారతారన్న ప్రచారం జరిగింది. అయితే ఓడినా నియోజకవర్గానికి టచ్‌లోనే ఉన్న ఆయన వీలు దొరికినప్పుడల్లా మంగళగిరి వాసులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఈ సారి లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ మంగళగిరిలోనే అమితుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యారు.

వాస్తవానికి లోకేశ్ స్థాయి నేత ఖచ్చితంగా గెలుస్తామనుకునే సీటుకి మారడం ఈజీనే .. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నా పార్టీ నేతలు అభ్యంతరపెట్టే పరిస్థితి ఉండదు. అయితే నియోజకవర్గం మారితే పారిపోయారని వైసీపీ ప్రచారం చేస్తుంది. అది ఇష్టం లేని లోకేశ్ మంగళగిరికే ఫిక్స్ అయ్యారంట.. అదీకాక ఇంటర్నల్‌గా చేయించుకున్న సర్వేలు, పార్టీ పరంగా వచ్చిన గ్రౌండ్ రిపోర్టులు ఆయనకు అనుకూలంగా వచ్చాయంటున్నారు

యువగళం పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టి వచ్చిన లోకేశ్ గత కొద్ది రోజులుగా మంగళగిరిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారుఉండవల్లి కరకట్ట మీద ఉన్న నివాసం నుంచి ఉదయాన్నే బయలుదేరి.. మంగళగిరిలో వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు .. స్ట్రీట్ మీటింగులు పెడుతూ సమస్యలు తెలుసుకుంటూ స్వయంగా వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ మంగళగిరికే పరిమితం అవ్వడం, ఆయన ప్రచారం చేస్తున్న తీరు పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తుందంట.

ఈసారి లోకేష్‌కు గెలుపు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీగా చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన ఆయన.. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఓటమితో నేర్చుకున్న పాఠాలతో ఈ సారి మంగళగిరికే టైం కేటాయిస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రజలు తమలో ఒకడు అనుకునేలా వ్యవహరిస్తూ.. సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిస్తున్నారు. అదే టైంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.

మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 85 ఎన్నికల్లో గెలిచింది టీడీపీ .. ఇక ఆ తర్వాత అక్కడ ఆ పార్టీ పోటీ చేసిందే లేదు. 1989 నుంచి పొత్తుల లెక్కలతో ఆ సీటు మిత్రపక్షాలకే వెళ్లింది. 2014లో టీడీపీ అభ్యర్ధిగా గంజి చిరంజీవి పోటీ చేసే వరకు అంటే పాతికేళ్లు అక్కడ టీడీపీ కేడర్‌కి పెద్ద దిక్కులేకుండా పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేశ్ లక్షకి పైగా ఓట్లు దక్కించుకున్నారంటే అక్కడ టీడీపీ కేడర్ బలం అర్థమవుతుంది.

వైసీపీ విషయానికి వస్తే గత పాతికేళ్లుగా మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ముగ్గురూ ఆ పార్టీలోనే ఉన్నారు. మురుగుడు హనుమంతరావు 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి , వైఎస్ కేబినెట్లో పనిచేశారు. 2009లో ఆయన రాజకీయ వారసురాలిగా కాండ్రుకమల కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఇక ఆ తర్వాత వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఆ ముగ్గురు ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు.

ఈ సారి మంగళగిరి సీటు బీసీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించడంతో .. అలిగిన ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేసి.. కొన్ని రోజులు కాంగ్రెస్‌లో షర్మిల వెంట తిరిగారు. తర్వాత తనదైన లెక్కలతో మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో లోకేశ్ పోటీలో ఉండరన్న ఉద్దేశంతో మంగళగిరి టీడీపీ టికెట్ ఆశించి కాండ్రు కమల పసుపు కండువా కప్పుకున్నారు.. అయితే లోకేశ్ మంగళగిరికే ఫిక్స్ అవ్వడంతో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

కాండ్రు కమల కుమార్తె, హునుమంతరావు కోడలు అయిన మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్ధిగా మంగళగిరి బరిలో నిలిచారు. మంగళగిరిలో బలంగా ఉన్న చేనేత వర్గానికి చెందిన ఫ్యామిలీ అవ్వడంతో బీసీ కోటాలో ఆమెకు టికెట్ కేటాయించారు జగన్ అదలా ఉంటే అదే బీసీ కోటాలో ముందుగా చేనేత వర్గాల్లో పట్టున్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్చార్జ్‌గా ప్రకటించింది వైసీపీ .. టీడీపీలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన చిరంజీవి వైసీపీలో చేరిన రోజుల వ్యవధిలోనే ఆప్కో ఛైర్మన్‌గానియమించి తర్వాత ఇన్చార్జ్‌ని చేసింది. అయితే తనకు మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదంట.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్కే చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు గంజి చిరంజీవి.. అలాంటాయన వైసీపీలో చేరి ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే ఆర్కే మాత్రం లావణ్యను గెలిపించి జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో మరోసారి తన లక్‌ను పరీక్షించుకుంటున్న లోకేశ్ ఈ సారి ఎలాగైనా గెలవాలన్ని కసితో ఉన్నారు. మరి మంగళగిరి ఓటర్ల జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

]]>
https://kpsnetwork.in/11/04/2024/2870/feed/ 0 2870
అసలుకే ఎసరు? https://kpsnetwork.in/08/04/2024/2867/ https://kpsnetwork.in/08/04/2024/2867/#respond Mon, 08 Apr 2024 13:23:47 +0000 https://kpsnetwork.in/?p=2867 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమలో రెండు సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ.. అనంతపురం రాజకీయాల్లో ఒక్క మగాడు అనిపించుకుంటున్న నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం, చంద్రబాబునాయుడు ఎనిమిదో సారి పోటీ చేస్తున్న కుప్పంలపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు సెగ్మెంట్లలో ఈ సారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు.. ఆ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. దాంతో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం కంటే వాటివైనే ఎక్కువ కసరత్తు చేయాల్సి వస్తోందంట. అయితే అక్కడ వైసీపీలో మారిపోతున్న సమీకరణలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటున్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్ రాయలసీమలో టీడీపీ కంచుకోటలు కుప్పం, హిందూపురం సెగ్మెంట్లో ఈ సారి ఎలాగైనా తమ జెండా పాతాలని తహతహలాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన్ని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి కుప్పం ఓటర్లు మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. 1983, 85 ఎన్నికల్లో అక్కడ టీడీపీ నుంచి రంగస్వామినాయుడు గెలుపొందారు. ఇక 1989 నుంచి కుప్పంలో చంద్రబాబు పాగా వేశారు. వరుసగా ఏడు సార్లు విజయం సాధించి రికార్డ్ సృష్టించారు.

అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ గణనీయంగా తగ్గింది. 30 వేల 722 ఓట్లకే పరిమితమైంది. ఆ ఎఫెక్ట్ చిత్తూరు ఎంపీ స్థానంపై కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం మున్సిపాల్టీ సహా. పలు పంచాయతీల్లో పరాజయం పాలైంది. ఆ లెక్కలతో ఇక కుప్పంలో చంద్రబాబు పనైపోయిందని ఈ సారి అక్కడ గెలిచేది తమ పార్టీనేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ క్రమంలో కుప్పంలో వైసీపీ అభ్యర్ధిగా స్థానికుడైన కేజే భరత్‌ను రెండేళ్ల క్రితమే ప్రకటించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు జగన్ .. గెలిస్తే భరత్‌ను మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. భరత్‌ను గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. అయితే ఒక దశ చంద్రబాబుపై పోటీకి భరత్ సరిపోరన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డే కుప్పం బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే చివరికి భరత్ పోటీలో నిలిచారు.

మరోవైపు చంద్రబాబు కుప్పం నుంచి పోటీని ఎప్పుడూ సీనియస్‌గా తీసుకోలేదు. అంతా స్థానికంగా ఉన్న చంద్రబాబు సొంత మనుషులు చక్కబెట్టేస్తూ వచ్చారు. ఏడాదికోసారి సంక్రాంతికి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి చంద్రబాబు అందరినీ ఓసారి పలకరించి వెళ్లిపోయేవారు. ఏడు సార్లు గెలిచినప్పటికీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు కుప్పం వచ్చిన దాఖలాలు పెద్దగా కనిపించవు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టడంతో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేశ్‌లు పర్యటిస్తుండటంతో కుప్పం టీడీపీ శ్రేణులు మరింత యాక్టివ్ అవుతున్నాయి. చంద్రబాబుని లక్షమెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇక నందమూరి హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురంపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్ధిని గెలిపించే బాధ్యతలు కూడా పెద్దిరెడ్డికే కట్టబెట్టారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి అక్కడ టీడీపీ ఓడిందే లేదు. ఎన్టీఆర్‌ను మూడు సార్లు గెలిపించిన అక్కడి ఓటర్లు. తర్వాత నందమూరి హరికృష్ణను కూడా అసెంబ్లీకి పంపారు. గత రెండు ఎన్నికల్లో బాలయ్య వరుస విజయాలతో హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

టీడీపీ అనేక సంక్షోభాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థినే ఆదరించారు. నందమూరి కుటుంబానికి చెందిన వారినే కాదు టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా పట్టం కట్టారు. ఎన్టీఆర్ మరణానంతరం 1999లో చంద్రబాబు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో సీసీ వెంకటరాయుడ్ని గెలిపించారు. 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో పి.అబ్దుల్ ఘని టీడీపీ నుంచే హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా హిందూపురంలో మాత్రం పసుపు జెండానే ఎగిరింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన ఇక్భాల్‌పై 14,028 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. గత ఎన్నికల్లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కగా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం అంత మెజారిటీ రావడంతో పార్టీ అక్కడ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.

టీడీపీ అంత బలంగా ఉన్న చోట వైసీపీ‌కి రీసెంట్‌గా పెద్ద షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ప‌ద‌వికి, వైసీపీకి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు సైతం ఇక్బాల్ ఫ్యాక్స్‌తో పాటు ఈ-మెయిల్ పంపించారు. మ‌రో మూడేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇక్బాల్ త్వరలోనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హిందూపురం అభ్యర్ధిగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకునే దీపికను బరిలోకి దింపింది వైసీపీ.. పెద్దిరెడ్డి రికమండేషన్‌తోనే ఆమెకు టికెట్ ఇచ్చారంట. దీపికను గెలిపించుకునే బాధ్యత తనదేనని జగన్‌కు భరోసా ఇచ్చి ఆమెకు టికెట్ ఇప్పించుకున్నారంట. దీపికకు హిందూపురం ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టినప్పుడే ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదురుదాడికి దిగారు. నాలుగేళ్లు ఇన్చార్జ్‌గా ఉన్న తనను తప్పించడం ఏంటని అప్పట్లో ఫైర్ అయ్యారు .. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయి మళ్లీ ఇన్నాళ్లకు సడన్ గా రాజీనామా అస్త్రం సంధించారు

ఒక్క మహమ్మద్ ఇక్బాల్ మాత్రమే కాక హిందూపురం వైసీపీలో అనేక వర్గాలు కనిపిస్తాయి. 2014లో బాలయ్య పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నీశ్చాల్, దివంగత చౌలురు రామకృష్ణారెడ్డి వర్గం మునిసిపల్ చైర్మన్ ఇంద్రజ గ్రూపు.. ఇలా ఎవరికి వారు సొంత అజెండా నడిపిస్తుంటారు. అలాంటి చోట రాజకీయాలకు కొత్త అయిన దీపికను బరిలో దింపి బాలయ్యకు చెక్ పెడతానంటోంది వైసీపీ.. మరి చూడాలి హ్యాట్రిక్ గ్యారెంటీ అంటున్న ఆయన స్పీడ్‌కి ఎలా బ్రేక్ వేస్తారో.

]]>
https://kpsnetwork.in/08/04/2024/2867/feed/ 0 2867
గ్రూపులుగా చీలిపోయిన వైసీపీ శ్రేణులు https://kpsnetwork.in/07/04/2024/2864/ https://kpsnetwork.in/07/04/2024/2864/#respond Sun, 07 Apr 2024 03:04:49 +0000 https://kpsnetwork.in/?p=2864 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తాడికొండ :- రాజధాని అమరావతిలో కీలక నియోజకవర్గం తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. లోకల్ సీనియర్ లీడర్లు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారంలో ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ టికెట్ ఆశించిన సీనియర్లు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వారి కేడర్ కూడా సైలెంట్ అయిపోయిందంట. మరోవైపు అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంతో అక్కడ భూములిచ్చిన రైతులు అధికారపక్షంపై రగిలిపోతున్నారు. దాంతో అసలే నియోజకవర్గం మారి వచ్చిన మాజీ మంత్రి సుచరిత.. దిక్కులు చూడాల్సి వస్తుందంటున్నారు.

అమరావతి రాజధానిలో కీలక నియోజకవర్గం తాడికొండ. రాష్ట్ర సెక్ట్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సెగ్మెంట్లోనే ఏర్పాటయ్యాయి. అయితే ఆ ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ గెలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చామన్న తాడికొండ రైతులు ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవిని గెలిపించారు. తర్వాత పరిణామాలతో వైసీపీలో తనకు టికెట్ దక్కదని గ్రహించిన శ్రీదేవి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి ఝలక్ ఇచ్చి సస్పెండ్ అయ్యారు. టీడీపీ బాట పట్టిన ఆమెపై ఈ మధ్యే అనర్హత వేటు పడి మాజీ అయ్యారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే లేని తాడికొండ నియోజకవర్గంలో ఇంతకాలం ఉండవల్లి శ్రీదేవి వెంట నడిచిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు. మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్ధిని జగన్ సర్కారు అటకెక్కించడంతో.. రాజధానికి భూములిచ్చిన రైతులు, వారి సంబంధీకులు టీడీపీ బాట పట్టారు. మిగిలిన వైసీపీ శ్రేణులు కొత్తగా వచ్చిన మేకతోటి సుచరిత వైపు చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడికొండను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంట.

మరోసారి తాడికొండలో తన అభ్యర్ధిని గెలిపించుకుని.. మూడు రాజధానుల నిర్ణయానికి బలం చేకూర్చుకోవడంతో పాటు.. అమరావతి వాసులు కూడా దానికి అనుకూలంగా ఉన్నట్లు నిరూపించుకోవాలని చూస్తున్నారంట. మరోవైపు టీడీపీ కూడా తాడికొండ నియోజకవర్గంలో గెలిచి తాడికొండలో గెలిచి అమరావతిని అభివృద్ధిబాట పడిస్తానంటోది. గతంలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్న ఆ సెగ్మెంట్లో ఓడిపోవడంతో ఈ సారి పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. తాడికొండ సీటు అనేక మంది ఆశించినప్పటికీ.. అక్కడ టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పైనే నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చింది.

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి ముందు నుంచి మద్దతిస్తున్న టీడీపీ. ఈసారి తప్పకుండా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే తాడికొండ వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వైసీపీ శ్రేణులు వర్గాలు విడిపోయాయి. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఆ పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. తాడికొండ వైసీపీ కేడర్ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, ఎంపీ నందిగామ సురేష్ వర్గాలుగా విడిపోయింది.

ప్రస్తుతం శ్రీదేవి పోటీలో లేనప్పటికీ నందిగం సురేష్ బాపట్ల ఎంపీ అభ్యర్ధిగా తిరిగి పోటీ చేస్తున్నారు. బాపట్ల ఎంపీ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న నందిగం సురేష్ తాడికొండపై మాత్రం దృష్టిపెట్టడం లేదంట. మరోవైపు తాడికొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించడంతో ఆయన కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన్ని తప్పించిన జగన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరితను తాడికొండకు షిఫ్ట్ చేశారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసి తర్వాత వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్. ఆశించిన టికెట్ దక్కకపోవడంతో.. సుచరితకు ఏ మాత్రం సహకరించడం లేదంట. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న డొక్కా.. అసలు తాను వైసీపీలో లేనట్లే వ్యవహరిస్తున్నారంట.. సీనియర్ నేతగా తాడికొండలో డొక్కాకి ఉన్న పరిచయాలు , అందరికీ సుపరిచితుడు అవ్వడం తనకు కలిసి వస్తుందని సుచరిత లెక్కలు వేసుకుంటే.. ఆయన అపరిచితుడిలా దూరంగా ఉండటం మాజీ హోంమంత్రికి మింగుడుపడటం లేదంట.

మాణిక్య వరప్రసాద్ తాడికొండలో సామాజిక సాధికార యాత్ర జరిగినప్పుడే వైసీపీపై అసంతృప్తితో కనిపించారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని.. అప్పట్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు .. అయితే తర్వాత కూడా జగన్‌ను కలిసే అవకాశం దక్కకపోవడంతో పార్టీ వ్యవహారాలకు దూరమయ్యారు. అసలు వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. దాంతో ఆయన రేపు ఏపీలో మళ్లీ పవర్ ఛేంజ్ అయితే పార్టీ మారడానికి రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటకిప్పుడు పార్టీ మారే పరిస్థితులు లేకపోవడంతో.. డొక్కా సైలెంట్‌గా తన పనులు తాను చేసుకుంటున్నారంట. మొత్తానికి ప్రత్తిపాడులో మూడు సార్లు గెలిచి.. ఈ సారి తాడికొండకు వచ్చిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందంట. ఎన్నికలకు ఇంకా టైం ఉండటంతో ఆ ఎక్స్ మినిస్టర్ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

]]>
https://kpsnetwork.in/07/04/2024/2864/feed/ 0 2864
ఆఫీసర్లూ.. చూపించిన భక్తి చాలు.. ఈసీ ఉంది జాగ్రత్త ! https://kpsnetwork.in/05/04/2024/2857/ https://kpsnetwork.in/05/04/2024/2857/#respond Fri, 05 Apr 2024 03:41:46 +0000 https://kpsnetwork.in/?p=2857 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- ఇది ఎలక్షన్ టైమ్.. ఇప్పటికే నేషనల్‌ వైడ్‌గా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ విషయాన్ని ఇంకా కొందరు అధికారులు గుర్తించినట్టు లేరు. ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తుతున్నారు. నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు. అయితే ఇకపై మీ ఆటలు సాగవంటోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా. హద్దు దాటితే కొరడా తీస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. నాట్ ఓన్లీ వార్నింగ్. ఇప్పటికే కొందరు అధికారులపై యాక్షన్ కూడా తీసేసుకుంది. ఈ చర్యలతో ఈసీ సందేశమేంటి? ఇప్పుడు అధికారులు చేయాల్సిందేంటి?

కంట్రీవైడ్‌గా తర్వాత మాట్లాడుదాం. ఫస్ట్‌ ఏపీపై ఫోకస్ చేద్దాం. సరిగ్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే జరిగిందో.. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రీపిట్ అవుతోంది ఏపీలో. 2019లో ఈసీ ప్రభుత్వాధికారుల తీరుపై కొరడా ఝుళిపించింది. అప్పుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగింది. దర్యాప్తు చేసింది. అప్పుడు చీఫ్‌ సెక్రటరీగా ఉన్న అనిల్ చంద్రతో సహా.. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుతో సహా.. కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్‌ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను బదిలీ చేసింది. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే సీన్ కనిపిస్తోంది. ఈసారి ఏకంగా ముగ్గురు IASలు, ఐదుగురు IPSలపై వేటు వేసింది. ఇందులో గుంటూరు రేంజ్ ఐటీ పాలరాజు కూడా ఉండటం విశేషం. వితౌట్ ఎనీ డీలే.. తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలంది ఈసీ. ఇది చాలదు. చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కూడా తప్పించాలంటోంది టీడీపీ.

ఒక్కొక్క అధికారి బదిలీకి ఒక్కో రీజన్ ఉంది. వాటి జోలికి మనం వెళ్లడం లేదు కానీ.. ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఈసీ వేట్లు. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 20 మంది అధికారులపై వేటు వేసింది ఈసీ. ఏపీతో పాటు.. అసోం, బిహార్, ఒడిశా, జార్ఖండ్‌లోని.. 8 మంది IASలు, 12 మంది IPSలపై వేటు పడింది. ఇందులో 9 మంది అధికారులు ఏపీ నుంచే ఉండటం విశేషం. ఈ కౌంట్‌ ఇంకా పెరగడం ఖాయం.

ఇప్పటి వరకు బదిలీ అయిన వారి లిస్ట్‌.. వారిపై వచ్చిన ఆరోపణలు చూస్తే.. చిలకలూరిపేటలో ప్రధాని మోడీ సభలో గందరగోళం ఏర్పడింది. విధుల్లో ఉన్న ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్‌లా కాకుండా.. వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డిపైనా సేమ్ ఆరోపణలు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డలో జరిగిన హత్యలు, మాచర్లలో దాడులు.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలపై బదిలీ వేటు పడింది. ఇక అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువాలపై కూడా టీడీపీ ఫిర్యాదులు చేసింది. ముగ్గురు కలెక్టర్లపై కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. అందుకే వారిపై కూడా చర్యలు తప్పలేదు.

ఈ బదిలీలు ఇక్కడితో ఆగుతాయా అంటే.. Without any hesitation ఆగవని చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా పెన్షన్‌ పంపిణీ ఇష్యూ ఏపీలో మరో రాద్దాంతానికి కారణమైంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాయి. ఇప్పటికే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. కొందరు ఈసీని టార్గెట్‌ చేస్తూ కూడా విమర్శలు చేశారు. వీటన్నింటిపై ఫోకస్ చేసింది ఈసీ. అసలు తప్పు ఎక్కడ జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? అన్న దానిపై ఫోకస్ చేసింది. వెరీ సూన్.. రాష్ట్రంలో చాలా మంది అధికారులకు స్థానభ్రంశం తప్పదని క్లియర్‌కట్‌గా తెలుస్తోంది.

మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే సీన్. బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొందరు అధికారులు ఎంత చేమటోడ్చారో చూశాం. ఏకంగా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి.. ఫండింగ్ అందకుండా చేయాల్సిందంతా చేశారు. ప్రజల కోసం కాకుండా.. ఓన్లీ బీఆర్ఎస్‌ కోసమే పనిచేశారు. ఫలితం ప్రస్తుతం వాళ్లు జైలుకు, కోర్టుకు చక్కర్లు కొడుతున్నారు. ఇవేవీ ఆరోపణలు కాదు.. ఏకంగా రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న విషయాలే.

అసలు అధికారులకు ఇంత స్వామి భక్తి ఎందుకన్నదే ఇప్పుడు క్వశ్చన్. ష్ట్రాలు ఏవైనా.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆ ప్రభుత్వ పెద్ద వర్గానికి చెందిన వారికే కీలక పోస్టులు దక్కుతున్నాయి. దీంతో ఆ పోస్టులు, కీలక శాఖలను దక్కించుకునేందుకు.. టు IASలు, ఇటు IPSలు పోటీ పడుతున్నారు. వారి మాట వింటే పోస్టు ఉంటుంది.. లేదంటే ఊస్టే. మళ్లీ పోస్టింగ్‌ ఉంటే ఉంటుంది.. లేదంటే లేదు. ఇలా తయారైంది ఏపీలో పరిస్థితి. మేము ఇక్కడ ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదు. ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. ఏ సర్కార్‌ వచ్చినా ఇదే తీరు కంటిన్యూ అవుతోంది. దీంతో ఎందుకొచ్చిన పంచాయితీ అని జీహుజూర్ అంటూ అధికారులు కూడా కాలం గడిపేస్తున్నారు.

అయితే అధికారులు ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చింది. నేతల భజనలు చేయడానికి కాదు.. వారి ఆదేశాలను పాటించడానికి కాదు. వారు పనిచేయాల్సింది ప్రజల కోసం. సమాజం మేలు కోసం. వారికి జీతాలు ఇచ్చేది నేతలు కాదు. ప్రజలు కష్టార్జితం చేసి సంపాదించి ప్రభుత్వానికి కట్టే పన్నులతో.. ఈ విషయాన్ని మరిచి లైన్ దాటిన వారిపై ఈరోజు కాకపోతే.. రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి.. ఎప్పుడైనా వేటు తప్పదు. ఇప్పటికైనా మేల్కోండి.. నేతల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయండి. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకోండి. ఎన్నికల్లో అక్రమాలకు చాన్స్ ఇవ్వకండి. ఇదే ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది.

]]>
https://kpsnetwork.in/05/04/2024/2857/feed/ 0 2857
రేపే కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. కవిత గురించి ఏం చెబుతారు? https://kpsnetwork.in/27/03/2024/2834/ https://kpsnetwork.in/27/03/2024/2834/#respond Wed, 27 Mar 2024 10:08:22 +0000 https://kpsnetwork.in/?p=2834 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేజ్రీవాల్ రేపు పూర్తి వివరాలను బయటపెడతారని ఆయన భార్య సునీత చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.ఆయన ఏం చెబుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.కవిత ప్రమేయంపై ఎలాంటి విషయాలు వెల్లడిస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నారు.

దేశంలో ప్రస్తుతం అత్యంత దుమారం రేపుతున్న విషయం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఈడీ అధికారులు వరుసగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఈనెల 21 అరెస్ట్ చేసింది. మార్చి 28 వరకు కోర్టు ఆయనను కస్టడీకి ఇచ్చింది. అరెస్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్ అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక రేపు ఆయనను ఈడీ మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనుంది.

కేజ్రీవాల్ భార్య సంచలన ప్రకటన…

కేజ్రీవాల్‌ను రేపు కోర్టులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన భార్య వీడియోలో సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ రేపు కోర్టులో సంచలన విషయాలు బయటపెడతారని ఆమె పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో చెబుతారని.. దానికి తగిన ఆధారాలను కూడా ఇస్తారని చెప్పారు.

రేపు కోర్టులో ఏం చెప్పబోతున్నారు?

కేజ్రీవాల్ భార్య ప్రకటనతో ఇప్పుడు అందరూ రేపు ఆయన కోర్టులో ఏం చెప్పబోతున్నారు అనేది చర్చించుకుంటున్నారు. రేపు కేజ్రీవాల్ నిజంగానే కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి సంచలన విషయాలను బయటపెడతారా? ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి కూడా మాట్లాడతారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. అసలు కేజ్రీవాల్‌కు ఈ కేసు గురించి ఏం తెలుసు? ఇందులో ఎవరెవరు ఉన్నారు? లాంటి విషయాలు బయటకు వస్తాయామో అని అనుకుంటున్నారు. దాంతో పాటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి కూడా ఏం చెబుతురోనన్న చర్చ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సాగుతోంది. కేజ్రీవాల్ తన వాదనలో కవిత నిర్దోషి అని చెబితే.. ఆమెకు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉంది.

లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ?

లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో కేజ్రీవాల్‌ రేపు చెబుతారని ఆయన సతీమణి సునీత ఈ రోజు విడుదల చేసిన వీడియోలో వెల్లడించడం కూడా ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ కేజ్రీవాల్ ఇదంతా బీజేపీ కుట్రని చెబుతున్నారు. ఇప్పుడు రేపు కోర్టులో కేజ్రీవాల్ కూడా అదే చెబుతారా? బీజేపీ వాళ్ళ దగ్గరే డబ్బులు అన్నీ ఉన్నాయని ఆయన ప్రకటిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కవిత కూడా నిన్న ముగ్గురు బీజేపీ నేతల గురించి ప్రస్తావించారు. వాళ్లు, వీళ్ళూ ఒక్కటేనా? అని కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి రేపు కేజ్రీవాల్ చెప్పబోయే విషయాల మీద చాలా మంది భవిష్యత్తు ఆధారపడి ఉందన్న చర్చ దేశ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కవిత గురించి ఆయన ఏం చెబుతారోనని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

]]>
https://kpsnetwork.in/27/03/2024/2834/feed/ 0 2834
కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా, కొత్త సీఎం వస్తారా? https://kpsnetwork.in/22/03/2024/2827/ https://kpsnetwork.in/22/03/2024/2827/#respond Fri, 22 Mar 2024 03:51:48 +0000 https://kpsnetwork.in/?p=2827 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, న్యూఢిల్లీ :- ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi CM) అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్ట్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎంగా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi CM) అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) అరెస్ట్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అరెస్ట్ తర్వాత అనేక చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు కేజ్రీవాల్‌ను ఈడీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వాన్ని(delhi government) ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎం(new cm)గా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి జైలుకు వెళితే ఢిల్లీ సీఎం ఎవరన్న చర్చ సర్వత్రా నెలకొంది. అయితే దీనిపై కేజ్రీవాల్ అరెస్ట్(arvind kejriwal arrest) అయితే ఎంటీ పరిస్థితి అని ఆప్ సిగ్నేచర్ క్యాంపెయిన్‌ను గతంలో నిర్వహించింది. అందులో 90 శాతం మంది ముఖ్యమంత్రి జైలు నుంచే ఢిల్లీని పరిపాలిస్తారని చెప్పారు. దీంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా తమ అధినేత కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీని పాలిస్తారని అన్నారు. జైల్లోనే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి(Atishi Marlena) కూడా అన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకుండా అడ్డుకునే చట్టం ఏదీ లేదని వెల్లడించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయించుకున్నారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ కూడా స్పష్టం చేశారు.

నెక్ట్స్ సీఎం ఎవరు?

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ(aam aadmi party)లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ జైలులో ఉండటంతో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మాత్రమే ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ కూడా అధికారం చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీఎంగా ఉండగా అరెస్ట్ అయిన తొలి నేత

దేశంలోనే పదవిలో ఉండగానే అరెస్టయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్(arvind kejriwal) కావడం విశేషం. అయితే దీనికి ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఆయన కార్యాలయంలో ఉండగానే ఈడీ అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి, గవర్నర్‌కు రాజీనామా సమర్పించడానికి అవకాశం ఇచ్చింది.

]]>
https://kpsnetwork.in/22/03/2024/2827/feed/ 0 2827