Warning: Cannot modify header information - headers already sent by (output started at /var/www/fastuser/data/www/kpsnetwork.in/index.php:1) in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/feed-rss2.php on line 8
Political News – KPS NETWORK https://kpsnetwork.in Digital Media Thu, 25 Apr 2024 03:49:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://i0.wp.com/kpsnetwork.in/wp-content/uploads/2021/08/cropped-television-05-icon.png?fit=32%2C32&ssl=1 Political News – KPS NETWORK https://kpsnetwork.in 32 32 196956755 టెన్షన్‌లో తమ్మినేని https://kpsnetwork.in/25/04/2024/2913/ https://kpsnetwork.in/25/04/2024/2913/#respond Thu, 25 Apr 2024 03:49:28 +0000 https://kpsnetwork.in/?p=2913 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, శ్రీకాకుళం :- సిక్కోలు జిల్లా ఆముదాలవలస నియోజవర్గంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి మామా, అల్లుడు తలపడుతున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గ రాజకీయం రక్తి కడుతోంది. మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది.మరో వైపు నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి నేతలు ప్రస్తుత ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా రెబల్స్‌గా బరిలోకి దిగారు. సెగ్మెంట్లో కుటుంబ పాలనకు చెక్ పెడతామంటూ స్పీకర్‌కి షాక్ ఇస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై వైసీపీ తరుపున తమ్మినేని సీతారాం గెలుపొంది ప్రస్తుతం ఏపీ శాసనసభపతిగా కొనసాగుతున్నారు. కాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్, తమ్మినేనికి సొంత మేనల్లుడు. కూన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం వివాహం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి అముదాలవలసలో ఆ మామాఅల్లుళ్లు తలపడుతున్నారు

2009లో తమ్మినేని టిడిపిని వీడి ప్రజారాజ్యం తరఫున బరిలోకి దిగగా.. టిడిపి అభ్యర్థిగా కూన రవి కుమార్ మొదటిసారి అసెంబ్లీ బరిలో ఆయనపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో మామ అల్లుళ్ళు ఇద్దరు ఓటమిపాలయ్యారు. తరువాత 2014లో తమ్మినేని వైసీపీ తరఫున, కూన రవి టిడిపి తరఫున ప్రత్యక్ష పోరుకు దిగగా కూన రవి కుమార్ గెలుపొందారు. ఈ ఇరువురు నేతల మధ్య బంధుత్వం 2014 ఎన్నికల నుంచి పొలిటికల్ వైరానికి దారితీసింది.

సీనియర్ నేతైన తమ్మినేని సీతారాం ఏడుసార్లు ఆమదాలవలస అసెంబ్లీ స్థానం నుండి ఎంఎల్ఏ గా గెలుపొందారు. టిడిపి ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల తర్వాత తమ్మినేని చాలా కాలం అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓటమిని చూసిన తమ్మినేని 2019లో వైసిపి తరుపున గెలుపొంది శాసనసభ స్పీకర్ అయ్యారు. 2024 ఎన్నికల్లోనూ మామ అల్లుళ్లే ప్రధాన ప్రత్యర్ధులుగా తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలు హీటెక్కిస్తున్నారు.

తమ్మినేని సీతారాం పెద్ద అవినీతిపరుడని అంగన్వాడీ , షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారని, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూన రవి ఆరోపిస్తుoటే టీడీపి హయాంలో పురుషోత్తపురం అక్రమ ఇసుక ర్యాంప్, ఆమదాలవలస భూ ఆక్రమణ, వెన్నెలవలసలో కూనవారిపూలతోట పేరిట వంద ఎకరాల ప్రభుత్వ భూఆక్రమణకు యత్నించటం వంటి అక్రమాల మాటేంటని ఇటు తమ్మినేని కూన రవిని ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలపైన, అభివృద్ధి పైన చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.

వైసిపి కి విశేష ప్రజాదరణ ఉందని 2024 ఎన్నికల్లో తనకు 20వేలకు పైబడి మెజారిటీ వస్తుందని తమ్మినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 20వేలకు పైబడి మెజారిటీ రాకపోతే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనంటున్నారు. అయితే తమ్మినేనికి ఆరోగ్యం క్షీణించి తనకు వచ్చే మెజారిటీని ఆయనకు వస్తుందని రివర్స్ లో చెబుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు కూన రవికుమార్. ఆమదాలవలసకు ఒక ఎమ్మెల్యే కావాలా లేక ముగ్గురు ఎమ్మెల్యే లు కావాలో నిర్ణయించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు కూన రవి పిలుపునిస్తున్నారు .

తమ్మినేని గెలిస్తే అతను, అతని భార్య వాణి, అతని కుమారుడు చిరంజీవి నాగ్ అధికారం చెలాయిస్తారని మూడు కలక్షన్ సెంటర్లు ఏర్పడతాయని కూన రవి ఆరోపిస్తున్నారు. అయితే తనతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవకు అంకితవుతున్న తన కుటుంబ సభ్యులపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు తమ్మినేని పెరిగిన నిత్యావసరాల ధరలు, ప్రభుత్వ ఇసుక, మద్యం విధానాలలో డొల్లతనం, అవినీతి, పడకేసిన అభివృద్ధితో ప్రజలు విసిగివేశారారని, ఈ ఎన్నికల్లో వైసిపిని గద్దె దించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కూన రవి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వారి అభివృద్ధికి మధ్యలోనే నిలిచిపోయిన శ్రీకాకుళం, ఆమదాలవలస ప్రధాన రహదారి విస్తరణ పనులే నిదర్శనమని కూన రవికుమార్ విమర్శిస్తున్నారు. ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్‌కి టిడిపి హయాం లో 37 కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ నిధులను నాయకులు స్వాహా చేయడమే కాకుండా ఐదేళ్లు అయినా ఆ రోడ్ ని ఆలాగే వదిలేసారని కూన రవికుమార్ తమ్మినేని పై మండిపడుతున్నారు.

ఆమదాలవలస శ్రీకాకుళంరోడ్ వేయడానికి ముందుకి వచ్చిన కాంట్రక్టర్ దగ్గర స్పీకర్ తమ్మినేని సీతారాం 2 కోట్లు నొక్కేసారని తమ్మినేని సీతారాంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ 2 కోట్లు తోనే తన కొడుకు పెళ్లి చేశారని కూన రవికుమార్ పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి వలనే ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్ పూర్తి కాలేదని రోడ్ పై ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మామా అల్లుళ్ళ పోరులో వైసీపీ అసమ్మతి నేతలు రంగంలోకి దిగి తమ్మినేనికి షాక్ ఇస్తున్నారు. కుటుంబ పాలన వద్దు సువ్వారి గాంధీ ముద్దు అంటూ స్వతంత్ర్య అభ్యర్థిగా వైసిపి రెబల్ గాంధీ పోటీకి దిగారు. అముదాలవలస వైసీపీ టికెట్ కోసం వైసిపి నేత సువ్వారి గాంధీ, జోనల్ వైసీపీ ప్రచార విభాగం ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌లు తమ్మినేనితో పోటీ పడ్డారు. దాంతో వైసీపీలో మూడు గ్రూపులు వెలిశాయి. అయితే పార్టీ అధిష్టానం టికెట్ ను తమ్మినేనికి కేటాయించడంతో వెంటనే గాంధీ, అతని భార్య మాజీ ఎంపీపీ దివ్య, అతని మరదలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ సువర్ణ పార్టీకి, పదవులకు రాజీనామా చేసేశారు. అనంతరం గాంధీ స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నట్లు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్నారు.

మరోవైపు చింతాడ రవికుమార్‌ను పార్టీ పెద్దలు బుజ్జగించి తమ్మినేనికి అనుకూలంగా పనిచేసేలా ఒప్పించారు. అయితే గాంధీ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇటు తమ్మినేని పై, అటు కూన రవిపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. మామా అల్లుల్లు ఇద్దరు ఒకరిపై ఒకరు బయటికి విమర్శించుకుంటున్న లోపాయికారీగా ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని సువ్వారి గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు.

కూన రవికుమార్‌కి ఆమదాలవలస టీడీపీలో ఎటువంటి వ్యతిరేకతా లేదు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆ పార్టీ రెబల్ పోటీకి దిగడం ఆయనకు తలనొప్పిగా మారిందంట. మరో వైపు ఆమదాలవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం పై అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా లో తన తమ్మినేని సీతారాం కోట్లు రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా తమ్మినేని కి ఈ సారి ఎన్నికల్లో ఇబ్బందిపెట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది. ఒవైవు ఆమదాలవలస రోడ్ పూర్తి కాకపోవడం అందులో కూడా తమ్మినేని కి అవినీతి ఆరోపణలు అదే రోడ్ పై పదుల సంఖ్యలో మరణాలు ఈ సారి ఎన్నికల్లో తమ్మినేనికి నెగిటివ్‌గా మారాయని సొంత పార్టీ వాళ్లే చర్చించుకుతున్నారు.

మొత్తానికి మామ అల్లుళ్ళ పోరు ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రాన్ని తలపిస్తుంది.దీంతో నియోజకవర్గ రాజకీయం రక్తి కట్టిస్తుంది. ఆమదాలవలస నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాంతో ఆసెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందనే ఆసక్తి రేపుతోంది.

]]>
https://kpsnetwork.in/25/04/2024/2913/feed/ 0 2913
చంద్రబాబు నామినేషన్ దాఖలు చేసిన భువనేశ్వరి https://kpsnetwork.in/19/04/2024/2877/ https://kpsnetwork.in/19/04/2024/2877/#respond Fri, 19 Apr 2024 08:10:01 +0000 https://kpsnetwork.in/?p=2877 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కుప్పం :- టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ ను ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలో దాఖలు చేశారు. ముందుగా వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ ను ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో (Kuppam) దాఖలు చేశారు. ముందుగా పి. ఈ. ఎస్ మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ నుండి వరదరాజస్వామి ఆలయానికి వెళ్లారు భువనేశ్వరి. ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల నడుమ భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు నామినేషన్ పత్రాలను వరదరాజాస్వామి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదరాజస్వామి దర్శనం అనంతరం శ్రీ పేరుందేవీ తాయర్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని సందడి చేశారు. అనంతరం, భారీ ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

]]>
https://kpsnetwork.in/19/04/2024/2877/feed/ 0 2877
విడదల ఎఫెక్ట్.. మాధవి డిఫెక్ట్.. గెలుపు స్వరం ఎటువైపు ? https://kpsnetwork.in/04/04/2024/2849/ https://kpsnetwork.in/04/04/2024/2849/#respond Thu, 04 Apr 2024 03:23:45 +0000 https://kpsnetwork.in/?p=2849 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, గుంటూరు :- గుంటూరు వెస్ట్‌ టీడీపీకి బలమైన స్థానం. గత రెండు ఎన్నికల్లో అక్కడ గెలుస్తూ వస్తున్న టీడీపీ ఈ సారి కూడా అభ్యర్ధిని మార్చింది. ఆచితూచి మహిళా అభ్యర్ధినే ఎంపిక చేసింది. రాజకీయాలకు కొత్త అయిన పిడుగురాళ్ల మాధవిని ప్రకటించింది. అయితే ఇప్పుడుటీడీపీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయంట. అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీపైనా ఒత్తిడి పెరిగింది. ఆ క్రమంలో టీడీపీ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ నియోజకవర్గంలో టీడీపీలో అంత తడబాటు ఎందుకు?

గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి. ఈ నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బలమైన పునాదులు వేసుకుంది. వరుసగా రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే గెలిచారు. ఈ సారి అక్కడ ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది. బీసీలు ఎక్కువగా ఉంటే గుంటూరు వెస్ట్‌లో అదే వర్గానికి చెంచిన మంత్రి విడుదల రజనీని బరిలోకి దింపింది వైసీపీ. ఆమె ప్రచారంలో దూసుకుపోతూ అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

వైసీపీ నుంచి బలమైనటువంటి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన విడుదల రజినీని ఎదుర్కోవడానికి.. టీడీపీ పెద్ద కసరత్తే చేసింది .. అక్కడ టీడీపీ నుంచి గెలిచిన మద్దాల గిరి వైసీపీ బాట పట్టడంతో కొత్త కేండెట్ కోసం వెతికింది …అనేక సర్వేలు చేయించుకుని పార్టీలో పార్టీలో సమాలోచనలు జరిపి.. పొలిటికల్‌గా రకరకాల లెక్కలు వేసుకుని గుంటూరు సిటీలో గుర్తింపు ఉన్న వికాస్ హస్పటల్స్ డైరెక్టర్ పిడుగురాళ మాధవిని అభ్యర్థిగా ప్రకటించింది. అనూహ్యంగా కొత్త ముఖమైన పిడుగురాళ్ల మాధవిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ సీటు ఆశించిన నేతలు షాక్ తిన్నారంట. తమకు అవకాశం వచ్చుంటే బాగుండేదని తమ కేడర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.

అదలా ఉంటే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మాధవి ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారని.. మంత్రి రజిని దూకుడుకి అడ్డుకట్ట వేయటంలో ఇబ్బంది పడుతున్నారని.. అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోసారి పార్టీ శ్రేణుల అభిప్రాయం తెలుసుకుంటూ.. స్థానిక నేతలతో కూడా టీడీపీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్తున్నారు మాధవి ప్రచారతీరు ఎలా ఉంది? రజనీని ఎదుర్కోవడానికి అమె సరిపోతారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాధవి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? పార్టీ శ్రేణులు కొత్త అభ్యర్ధిపై ఏ అభిప్రాయంతో ఉన్నాయి? వంటి అంశాలపై పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారంట.

ఆ అభిప్రాయ సేకరణలో మాధవీకి మైనస్ మార్కులే వస్తున్నాయంటున్నారు. అక్కడి లోకల్ లీడర్లు ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తునట్లు చెప్తున్నారు. ఒక వైపు రజినీ తనదైన స్టైల్లో దూకుడు ప్రదర్శిస్తుంటే.. మాధవి ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటంలో కానీ.. కార్యకర్తల్లో జోష్ పెంచే విషయంలో కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారన్న సమాచారం పార్టీ పెద్దలకు చేరిందంట.. గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకెళ్తున్నా.. మాధవి ఆయనతో సమన్వయం చేసుకోలేకపోతున్నారని స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారంట.

మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పెద్దలు మాధవి దూకుడుగా ముందుకు వెళ్లడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారా? లేకపోతే రజనీని ధీటుగా ఎదుర్కునే మరో బలమైన నేతని రంగంలోకి దింపుతారా? అన్న చర్చ మొదలైంది.. మాధవిని సెలెక్ట్ చేసే ముందు టీడీపీ అధిష్టానం చాలా ఎక్సర్‌సైజ్ చేసినట్లే కనిపించింది. పార్టీలో మిగిలిన ఆశావహుల విజయ అవకాశాలపై అంచనాలకు వచ్చాకే .. మాధవి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించింది. అయితే ఇప్పుడు అందుతున్న గ్రౌండ్ రిపోర్టులతో చంద్రబాబు టీం పునరాలోచనలో పడిందంటున్నారు. ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని ప్రజల్లోకి దూసుకు వెళ్తున్న తీరుపై సంతోషంగా ఉన్నప్పటికీ.. వెస్ట్ అభ్యర్థి విషయం పార్టీ పెద్దలకు అంతుపట్టడం లేదంట.. మొత్తానికి కంచుకోట లాంటి సీటు ఇప్పుడు టీడీపీకి కత్తిమీద సాములా మారినట్లు కనిపిస్తోంది. ఈ నెల 25 నామినేషన్లకు చివరి తేదీ కావడంతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చేనాటికి టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

]]>
https://kpsnetwork.in/04/04/2024/2849/feed/ 0 2849
పిఠాపురం మే సవాల్! సేనాని vs వైసీపీ https://kpsnetwork.in/21/03/2024/2824/ https://kpsnetwork.in/21/03/2024/2824/#respond Thu, 21 Mar 2024 03:37:19 +0000 https://kpsnetwork.in/?p=2824 KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పిఠాపురం :- పవన్.. పిఠాపురం.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నవి ఈ రెండే ..రీజన్.. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే కాదు. ఎన్నికలే పెండింగ్.. నా విక్టరీ ఎప్పుడో అయిపోయింది. ఇది పవన్ కాన్ఫిడెన్స్.. ఆట అప్పుడే అయిపోలేదు.. ముందుంది అసలు సినిమా.. ఇది వైసీపీ నేతల కౌంటర్ డైలాగ్స్..మరి నిజంగా పిఠాపురంలో పవన్‌ గెలిచినట్టేనా? ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లక్ష మెజారిటీ వస్తుందా? వైసీపీ నేతలు వేస్తున్న కౌంటర్ స్కెచ్‌ ఏంటి?

పిఠాపురం పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.. తన గెలుపు నల్లేరుపై నడక.. లక్ష మెజార్టీ కన్ఫామ్‌ అనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా.. అసలు ఓటు వేయడమే లేటు.. ప్రమాణస్వీకారం చేయడమే పెండింగ్ అన్నారు.. అలా అంటూనే.. గెలిపించండి అంటూ ఎప్పుడు లేనిది చెతులెత్తి దండం పెట్టారు.. పదేళ్ల తర్వాత నోరు తెరిచి అడుగుతున్నాను.. నాకే ఓటు వేయండి అన్నారు. అడగనిదే అమ్మైనా పెట్టదు.. అందుకే అడుగుతున్నాను.. నన్ను గెలిపించండి.. జనసేన అభ్యర్థులను గెలిపించండి. ఇది పవన్ వర్షన్.. మొత్తంగా చూస్తే గెలుపుపై పవన్‌ ఫుల్‌ ధీమాలో ఉన్నారు పవన్.. అసలు పవన్ పిఠాపురాన్ని ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు..

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ చేశారు.. ఆ రెండు స్థానాల్లో ఓడిపోయారు.. కానీ ఈసారి మాత్రం కేవలం పవన్ ఓన్లీ పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు..దీని బట్టే అర్థమవుతోంది ఆయనకు అక్కడ కచ్చితంగా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందని. అయితే ఈ కాన్ఫిడెన్స్‌ వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి..పిఠాపురంలో దాదాపు 91 వేల కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు.. వీరే నేతల గెలుపోటములను డిసైడ్ చేసేఇంది. నిజానికి 2019లో కూడా పిఠాపురం నుంచే పవన్‌ బరిలోకి దిగాలని చాలా మంది సజెస్ట్ చేశారు.. కానీ పవన్ సింపుల్‌గా నో చెప్పేశారని టాక్. ఈసారి మాత్రం పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకొని సర్వేలు చేయించారు. అన్ని సర్వేల్లో పవన్‌కు రిజల్ట్‌ పాజిటివ్‌గా వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి.. అండగా ఉండే కాపు ఓటర్లు.. ఇతర క్యాస్ట్‌కు చెందిన యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌.. ఇటీవల పవన్ నిర్వహించిన వారాహీ టూర్‌కు వచ్చిన రెస్పాన్స్‌.. ఇవన్నీ లెక్కలు వెసుకున్న పవన్.. పిఠాపురంలో తన విక్టరీ చాలా ఈజీ అనే థాట్‌లో ఉన్నారు..

ఇదంతా పవన్.. జనసేన వర్షన్.. మరీ అధికార వైసీపీ సంగతేంటి? నిజంగా పవన్‌కు అంత అప్పనంగా పిఠాపురాన్ని అప్పగించేస్తారా? అంటే నో అనే చెప్పాలి.. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ పవన్‌ ఓడించిన వైసీపీ.. ముచ్చటగా మూడో నియోజకవర్గంలో ఓడించి.. హ్యాట్రిక్‌ డిఫీట్‌ను ఆయన అకౌంట్‌లో వేయాలని చూస్తోంది..

పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలవగానే అలర్ట్ అయ్యారు జగన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టేసి, కాకినాడ ఎంపీ వంగా గీతను తెరపైకి తెచ్చింది. దీంతో పిఠాపురం పాలిటిక్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.. ఫర్ ది ఫ్యాక్ట్.. వంగా గీత పొలిటికల్ కెరీర్ పీఆర్పీ నుంచే మొదలైందని చెప్పాలి.. 2009లో పీఆర్పీ నుంచి ఇదే నియోజకవర్గం బరిలో నిలిచి గెలిచారు వంగా గీత.. అలాంటి గీతే… ఇప్పుడు పవన్ ప్రత్యర్థి.. ఎంపీగా ఉన్న సమయంలోనే పిఠాపురంపై గీత స్పెషల్ ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెజారిటీ వాటా పిఠాపురానికే దక్కింది. ఇటీవల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు.. ఇవన్నీ కాదు.. పవన్‌ నోటి నుంచి గెలిచేశాను.. లక్ష మెజార్టీ అనే వర్డ్స్ రాగానే.. వైసీపీ పెద్దల కళ్లు పిఠాపురంపై పడేలా చేశాయి.. పవదన్‌ది కాన్ఫిడెన్స్‌ కాదు.. ఓవర్ కాన్ఫిడెన్స్‌ అని ప్రూవ్ చేయాలని తహతహలాడుతున్నాయి.. ఎస్పెషల్లీ సీఎం జగన్‌ ఇప్పుడు పిఠాపురంపై ఫోకస్ చేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.. వైసీపీది కూడా సేమ్ స్ట్రాటజీ.. ఏ సామాజిక వర్గాన్నైతే పవన్ నమ్ముకున్నారో.. అదే సామాజికవర్గ నేతలను పవన్‌కు వ్యతిరేకంగా బరిలోకి దింపుతున్నారు.. ఇప్పటికే పిఠాపురం నేతలతో కాపు రిజర్వేషన్‌ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చర్చలు ప్రారంభించేశారు..

ఓవరాల్‌గా చూస్తే.. వంగా గీతకు అనుకూలంగా పరిస్థితులు మార్చేందుకు తెర వెనుక మంత్రాంగం మొదలైంది. అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలకు.. ముగ్గురు కీలక నేతలను ఇంచార్జ్‌లుగా అప్పాయింట్ చేసింది వైసీపీ.. పిఠాపురం మండలం బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి.. కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజా..గొల్లప్రోలు మండలం బాధ్యతలు మాజీ మంత్రి కన్నబాబు.. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పే బాధ్యతలు ముద్రగడకు.. వీరు ముగ్గురే కాక.. నియోజకవర్గానికి ప్రత్యేక ఇంచార్జ్‌గా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. ఒక్కో నేతకు ఒక్కో టాస్క్.. మండలాల ఇంచార్జ్‌లు అన్ని వర్గాలతో చర్చలు జరపడం.. ఆ మండలాల్లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులను మార్చడం..ఆర్థికపరమైన అంశాలను చూసుకునేందుకు ద్వారంపూడి..ఇక కాపు నేతలను సముదాయించే పని ముద్రగడకు.. ఇలా సరికొత్త స్ట్రాటజీతో పవన్‌కు షాక్ ఇచ్చేందుకు గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారు..

అటు జనసేన, ఇటు వైసీపీ కూడా ఆపరరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపారు పిఠాపురంలో.. ఏకంగా వైసీపీ అభ్యర్థి వంగా గీతను జనసేనలో చేరాలని ఇన్వైట్ చేశారు పవన్.. కానీ వైసీపీ మాత్రం జనసేన, టీడీపీ నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది.. ఇదంతా పవన్‌కు భయపడి చేస్తున్నారా? లేదంటే ఎలాగైనా ఓడించాలనే కసితో చేస్తున్నారా? మరి ఏ పార్టీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది? ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ ఎత్తుల ముందు జనసేనాని చిత్తవుతారా? పవన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నట్టు లక్ష మెజార్టీ వస్తుందా?

]]>
https://kpsnetwork.in/21/03/2024/2824/feed/ 0 2824
చిరంజీవి సీఎం అయ్యేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్.. చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యలు https://kpsnetwork.in/16/02/2024/2805/ https://kpsnetwork.in/16/02/2024/2805/#respond Fri, 16 Feb 2024 03:21:10 +0000 https://kpsnetwork.in/?p=2805 KPS డిజిటల్ నెట్‌వర్క్, తిరుపతి :- చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌. ఆయన సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అన్నారు. అలాగే ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు.

చిరంజీవికిం సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. చిరంజీవికి ఇదే మంచి అవకాశమని తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరారు. ముఖ్యమంత్రి అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశమని.. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ఇప్పుడు రాకపోతే పదేళ్ల పాటు కాపులు, బలిజలకు ఏ అవకాశం దక్కదని తెలిపారు. ఏపీలో సీఎం జగన్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 10 సీట్లు లోపు వస్తాయని జోస్యం చెప్పారు. పాకిస్థాన్‌ కంటే ఘోరంగా ఏపీ రాజకీయాలు ఉన్నాయని..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నీ వర్గాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు తీరు దారుణం..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అర్థరాత్రి చంద్రబాబు కలవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభ ఘోషిస్తోందన్నారు. వైఎస్‌ షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరిందని అభిప్రాయపడ్డారు చింతా మోహన్. షర్మిల రాకతో కాంగ్రెస్ మైలేజ్ మరింత పెరిగిందన్నారు. షర్మిలను సీఎంగా చూడాలని ప్రజల్లో ఉందని.. కాంగ్రెస్ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. రెండో స్థానంలో చంద్రబాబు నిలుస్తారని చెప్పుకొచ్చారు. తిరుపతి రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతి రాజధానిగా మారితేనే రాయలసీమలో కరువు పోయి అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయని.. బ్రహ్మంగారు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారని చెప్పుకొచ్చారు.

ఏపీ రాజధాని తిరుపతే..

తిరుపతి రాజధాని అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారని.. అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతమన్నారు. ఇక్కడ భూములు, వనరులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నాయన్నారు. మూడు రాజధానులు అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ అనటం ఏంటి? అని ప్రశ్నించారు. తన స్వార్థం, ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు హైదరాబాద్ ను విడిచి తుళ్లూరుకు వచ్చారని ఆరోపించారు. అలాగే వైసీపీ నేతలు కూడా తమ సొంత లాభాల కోసం విశాఖను రాజధాని చేయాలని అంటున్నారని మండిపడ్డారు. తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రి అయినట్లు ఏపీలో వైఎస్ షర్మిల సీఎం కావాలని రాష్ట్ర మహిళలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఓ మహిళా సీఎం కాకూడదా? అని ప్రశ్నించారు.ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. షర్మిల సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

]]>
https://kpsnetwork.in/16/02/2024/2805/feed/ 0 2805
రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి https://kpsnetwork.in/03/02/2024/2792/ https://kpsnetwork.in/03/02/2024/2792/#respond Fri, 02 Feb 2024 18:33:29 +0000 https://kpsnetwork.in/?p=2792 KPS డిజిటల్ నెట్‌వర్క్, ఇచ్చాపురం :- కంచిలి మండలంలోని జే బెల్లుపడలో శుక్రవారం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 4. 5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి వైసీపీ సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వాదించి రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలన్నారు.

]]>
https://kpsnetwork.in/03/02/2024/2792/feed/ 0 2792
అభ్యర్థుల ఖరారుపై టీడీపీ-జనసేన ఫోకస్‌.. లెక్కలు తేలేదెప్పుడు ? https://kpsnetwork.in/02/02/2024/2788/ https://kpsnetwork.in/02/02/2024/2788/#respond Thu, 01 Feb 2024 18:32:55 +0000 https://kpsnetwork.in/?p=2788 KPS డిజిటల్ నెట్‌వర్క్, అమరావతి :- కురుక్షేత్ర సమరాన్ని తలపిస్తున్న ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేయగా.. అటు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న టీడీపీ-జనసేన కూటమి కూడా అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీలు ఇప్పటికే 13 ఎంపీ సీట్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 11 చోట్ల టీడీపీ.. రెండు చోట్ల జనసేన పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. అయితే 11 మంది టీడీపీ అభ్యర్థుల్లో ముగ్గురు వైసీపీ నుంచి వచ్చిన నేతలే ఉన్నారు. మరో రెండు, మూడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు.. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ ప్రస్తుతానికి మచిలీపట్నం, కాకినాడ సీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది. శ్రీకాకుళంలో రామ్మోహన్‌, విశాఖలో భరత్‌, తిరుపతిలో నీహారిక, బెజవాడ నుంచి కేశినేని చిన్ని అభ్యర్థిత్వాలు ఖరారు కాగా.. ఇతర సీట్లకు సంబంధించి ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది.

ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచింది టీడీపీ. ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించింది. ఇక మిగిలిన 12 ఎంపీ సీట్లకు సంబంధించి పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వీటిపై కూడా త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. త్వరలో మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

]]>
https://kpsnetwork.in/02/02/2024/2788/feed/ 0 2788
పలాస పీఠం దక్కేదెవరికి..? అప్పలరాజుకు షాక్ తప్పదా..? https://kpsnetwork.in/20/01/2024/2762/ https://kpsnetwork.in/20/01/2024/2762/#respond Sat, 20 Jan 2024 12:34:46 +0000 https://kpsnetwork.in/?p=2762 KPS డిజిటల్ నెట్‌వర్క్, శ్రీకాకుళం :- శ్రీకాకుళం జిల్లాలోని పలాస సెగ్మెంట్ జీడిపప్పు ఇండస్ట్రీకి ఫేమస్. ఈ పట్టణానికి వైట్ గోల్డ్ సిటీగా పేరుంది. పలాస జీడిపప్పు అంటే గుర్తు పట్టని వారు ఉండరు. అంతటి టేస్ట్, క్వాలిటీకి పెట్టింది పేరు. పలాస నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. అంతకు ముందు ఇది సోంపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. సోంపేట అంటే టీడీపీ, టీడీపీ అంటే సోంపేట అన్నంతగా పాతుకుపోయింది. ఇక్కడ గౌతు కుటుంబానిదే రాజకీయ ఆధిపత్యంగా ఉండేది. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యాం సుందర్ శివాజీ 1985 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే 2014లో పలాసలో గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇక్కడ టీడీపీ గెలవగా.. ఆ తర్వాత ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju) వైసీపీ నుంచి గెలిచి హవా మార్చేశారు. మరి వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉండనుంది? KPS టీవీ డీటెయిల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే రిపోర్ట్‌లో ఏం తేలిందో చూద్దాం.. అంతకు ముందు 2019 ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం.

2019 RESULTS : సీదిరి అప్పలరాజు VS గౌతు శిరీష

YCP 51%
TDP 40%
JANASENA 4%
OTHERS 5%

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలాసలో వైసీపీ టిక్కెట్ పై సీదిరి అప్పలరాజు పోటీ చేయగా.. టీడీపీ నుంచి గౌతు శిరీష బరిలో నిలిచారు. టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అయిన పలాసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు పోటీ చేసి గెలిచారు. 51 శాతం ఓట్లు సాధించారు. అలాగే టీడీపీ నుంచి పోటీ చేసిన గౌతు శిరీష(Gouthu Shirisha) 40 శాతం ఓట్లు సాధించారు. ఇక్కడ జనసేన అభ్యర్థి 4 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా, ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పలాసలో వైసీపీ గెలిచింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోరు ఉండే అవకాశాలున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య ద్విముఖపోరు ఖరారు ఖాయంగా కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం పలాస సెగ్మెంట్ లో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? KPS టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

సీదిరి అప్పలరాజు (YCP)

సీదిరి అప్పలరాజు ప్లస్ పాయింట్స్

వైఎస్ జగన్ ఆశీస్సులు
బీసీ కళింగ కమ్యూనిటీ బలమైన సపోర్ట్
ఆరోగ్య సమస్యలున్న వారికి ఆర్థిక సహాయాలు

సీదిరి అప్పలరాజు మైనస్ పాయింట్స్

ప్రజలతో సరైన సమన్వయం నెరపకపోవడం
జీడిపప్పు రైతులకు సరైన మద్దతు ధర కల్పించకపోవడం
వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి చివరిదాకా సాగు నీరు అందించకపోవడం

గౌతు శిరీష (TDP)

గౌతు శిరీష ప్లస్ పాయింట్స్

టీడీపీ సంప్రదాయ ఓటర్ల బలమైన మద్దతు
తండ్రి సుదీర్ఘ రాజకీయ వారసత్వం
గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి
పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం
గ్రౌండ్ లెవెల్ లో ప్రచారం ముమ్మరం చేయడం

గౌతు శిరీష మైనస్ పాయింట్స్

బీసీ కళింగ కమ్యూనిటీ ఓటర్ల మద్దతు లేకపోవడం
కులాల వారీగా
మత్స్యకారులు 29%
కళింగ 26%
యాదవ్ 8%
ఎస్సీ 6%
ఎస్టీ 6%
షెట్టి బలిజ 2%

పలాసలో మత్యకారుల వర్గ అందులో ఉప వర్గాల జనాభా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత కళింగ కమ్యూనిటీ డామినెంట్ గా కనిపిస్తోంది. మరి పలాసలో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీల వారీగా వివిధ సామాజికవర్గాల అభిప్రాయం ఎలా ఉంది? KPS టీవీ సర్వేలో వాళ్లు చెప్పిన ఒపీనియన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. మత్స్యకారుల్లో పల్లి అనే ఉప వర్గం 17 శాతం ఉంది. వడ బలిజ వర్గానికి చెందిన వారు 10 శాతం ఉన్నారు. జాలరి వర్గానికి చెందిన వారు 2 శాతం మంది ఉన్నారు. వీరంతా కలిపి టీడీపీకి 35 శాతం సపోర్ట్ గా ఉంటామంటున్నారు. అదే సమయంలో జనసేనకు 60 శాతం మంది మద్దతు ఉంది. కేవలం 5 శాతం మంది మాత్రమే వైసీపీకి అనుకూలమంటున్నారు.

ఇక కళింగ కమ్యూనిటీలో 60 శాతం మంది టీడీపీ, 35 శాతం జనసేన, 5 శాతం వైసీపీకి మద్దతుగా ఉంటామని KPS టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు యాదవ వర్గంలో టీడీపీకి 50 శాతం, జనసేనకు 45 శాతం, వైసీపీకి 5 శాతం సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఎస్సీల్లో 35 శాతం తెలుగుదేశం, 60 శాతం జనసేన, 5 శాతం వైసీపీకి సపోర్ట్ ఇస్తామనగా, ఎస్టీల్లో టీడీపీ జనసేన కూటమికి 50 శాతం, అటు వైసీపీకి 50 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. షెట్టిబలిజ వర్గానికి చెందిన వారిలో టీడీపీకి 60 శాతం, జనసేనకు 35 శాతం, వైసీపీకి 5 శాతం మంది సపోర్ట్ ఇస్తామని KPS టీవీ సర్వేలో తమ అభిప్రాయాలు చెప్పారు.

ఇక వచ్చే ఎన్నికల్లో పలాసలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

గౌతు శిరీష vs సీదిరి అప్పలరాజు

TDP 48%
YCP 46%
OTHERS 6%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు ఎడ్జ్ కనిపిస్తోంది. మొత్తం 48 శాతం ఓట్ షేర్ తో గెలిచే అవకాశాలు ఎక్కువున్నట్లుగా KPS టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి మంత్రి అయిన సీదిరి అప్పలరాజుకు 46 శాతం ఓట్లు వస్తాయని ప్రజలు తమ అభిప్రాయంగా చెప్పారు. ఇతరులు 6 శాతం ఓట్లు దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయి.

]]>
https://kpsnetwork.in/20/01/2024/2762/feed/ 0 2762
వైసీపీ ఎన్నికల వ్యూహాలు.. టిక్కెట్స్ రేసులో ఆ బడానేతల వారసులు.. https://kpsnetwork.in/18/12/2023/2688/ https://kpsnetwork.in/18/12/2023/2688/#respond Mon, 18 Dec 2023 09:35:36 +0000 https://kpsnetwork.in/?p=2688 KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్‌ :- ఏపీలో సీఎం జగన్‌ క్లీన్‌ స్వీప్‌ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. 175 సీట్లే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు గెలుపు గుర్రాల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెకండ్‌ లిస్ట్‌ కూడా సిద్ధం అయినట్టు తెలుస్తుండటంతో వైసీపీ నేతలు టెన్షన్‌లో ఉన్నారు. జగన్‌ మదిలో ఉన్నదెవరో..? అభ్యర్థుల లిస్టు నుంచి తప్పించింది ఎవరినో అనే ఆందోళనలో ఉన్నారు.

ఏపీ సీఎం జగన్‌ వైనాట్ 175 అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులపై దృష్టి సారించారు. కుప్పుం నుంచి ఇచ్చాపురం వరకూ మార్పులే చేస్తున్నారు. కొందరిని తొలగిస్తూ మరికొందరిని మారుస్తుంటంతో బదిలీ కారణాలేంటో తెలియక వైసీపీ అధినేత తీరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు అధికార పార్టీ నేతలు.

ఇటీవల మార్చిన 11 నియోజకవర్గాల్లో మార్పులు తథ్యమన్న మాట కూడా వినిపిస్తోంది. మరోపక్క ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు కాకరేపుతోంది. ఏపీ మార్పుల గురించి కర్ణాటక ఎంపీ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతూ.. మీరైనా సీఎంకి చెప్పండంటూ ఎంపీకి సూచనలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే సీఎం సన్నిహితుల నుంచి కూడా ముఖ్యమంత్రికి ఆశావహుల వరుస కాల్స్‌ వస్తుండటంతోపాటు.. వైసీపీ ఎమ్మెల్యేలకి టికెట్స్‌ కోసం పక్క రాష్ట్రాల నుంచి సిఫార్సులు చేస్తుండటం ఏపీ ఎన్నికల రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల బరిలో వారసులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపు గుర్రాల లిస్టులో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వారసులు ఉన్నట్టు సమాచారం. ఇక ఇటీవల సర్వేలతో జగన్‌ మార్పులు, చేర్పులపై ఫోకస్‌ పెట్టడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి సర్వేలు నిర్వహిస్తోంది వైసీపీ అధిష్టానం.

]]>
https://kpsnetwork.in/18/12/2023/2688/feed/ 0 2688
కేసీఆర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు.. Y కేటగిరీకి కుదించిన ప్రభుత్వం https://kpsnetwork.in/15/12/2023/2685/ https://kpsnetwork.in/15/12/2023/2685/#respond Fri, 15 Dec 2023 10:28:28 +0000 https://kpsnetwork.in/?p=2685 KPS డిజిటల్ నెట్‌వర్క్, తెలంగాణ :- ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ కొత్త ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు భద్రతను కుదించింది. ఇప్పటి వరకూ జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు Y కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. Y కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4 ప్లస్ 4 గన్ మెన్లతో పాటు.. ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. ఆయన కాన్వాయ్ కు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు.

రాష్ట్రంలో మాజీ మంత్రులుగా పనిచేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పించింది రేవంత్ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లకు పూర్తిగా భద్రతను తొలగించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పలు అంశాలపై సమీక్షలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీల సెక్యూరిటీ పై కూడా సమీక్షించారు. భద్రత అవసరమైన వారికి, ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నవారికి గన్ మెన్లను కేటాయించవచ్చని తెలుస్తోంది. దీనిపై పూర్తిగా రివ్యూ చేశాకే తుది నిర్ణయం తీసుకుంటారు.

]]>
https://kpsnetwork.in/15/12/2023/2685/feed/ 0 2685