Warning: Cannot modify header information - headers already sent by (output started at /var/www/fastuser/data/www/kpsnetwork.in/index.php:1) in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/feed-rss2.php on line 8
Weather News – KPS NETWORK https://kpsnetwork.in Digital Media Thu, 20 Jul 2023 11:54:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://i0.wp.com/kpsnetwork.in/wp-content/uploads/2021/08/cropped-television-05-icon.png?fit=32%2C32&ssl=1 Weather News – KPS NETWORK https://kpsnetwork.in 32 32 196956755 హైద‌రాబాద్‌లో దంచికొడుతున్న వాన‌.. 122. 4 మి. మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు https://kpsnetwork.in/20/07/2023/2547/ https://kpsnetwork.in/20/07/2023/2547/#respond Thu, 20 Jul 2023 11:54:03 +0000 https://kpsnetwork.in/?p=2547 KPS డిజిటల్ నెట్‌వర్క్, మేడ్చల్: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొడుతోంది. గ‌త మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో వర్షపాతం గణనీయంగా పెరిగింది. సాధార‌ణంగా జులై 20వ తేదీ నాటికి హైద‌రాబాద్ న‌గ‌రంలో స‌గ‌టున 101. 2 మి. మీ. వ‌ర్ష‌పాతం న‌మోదవుతుంది. అయితే ఈ ఏడాది ఈ స‌మ‌యం నాటికి సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 122. 4 మి. మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

]]>
https://kpsnetwork.in/20/07/2023/2547/feed/ 0 2547
అగ్నిగుండంగా మారిన ఏపీ.. మరో రెండు రోజులు తీవ్ర వడగాల్పులు.. https://kpsnetwork.in/16/06/2023/2517/ https://kpsnetwork.in/16/06/2023/2517/#respond Fri, 16 Jun 2023 05:41:40 +0000 https://kpsnetwork.in/?p=2517 KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: ఏపీ అగ్నిగుండంగా మారింది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉష్టోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 210 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలోని 31 శాతం మండలాలు నిప్పుల గుండంగా మారాయి. మరో 220 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగానే ఉంది. మొత్తంగా 64 శాతంపైగా మండలాల్లోని ప్రజలు ఉష్ణతాపానికి అల్లాడారు. నర్సాపురంలో సాధారణం కంటే అధికంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

శుక్ర, శనివారాల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 268 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. మరో 235 మండలాల్లో వడగాల్పుల ప్రభావంగా ఉంటుందని తెలిపింది.

గురువారం అనకాపల్లి జిల్లాలోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. విశాఖపట్నం జిల్లాలోని 8 మండలాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా సత్యవేడులో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే విశాఖపట్నం, బాపట్లలో 7.1 డిగ్రీలు, మచిలీపట్నంలో 6.9 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డయ్యాయి.

]]>
https://kpsnetwork.in/16/06/2023/2517/feed/ 0 2517
అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన https://kpsnetwork.in/02/05/2023/2478/ https://kpsnetwork.in/02/05/2023/2478/#respond Tue, 02 May 2023 06:40:11 +0000 https://kpsnetwork.in/?p=2478 KPS డిజిటల్ నెట్‌వర్క్, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖా సూచిస్తుంది. ఇప్పటికే పట్టణాల్లోని కాలనీలోకి, పొలాల్లోకి నీళ్లు చేరాయి. తెలంగాణ, ఏపీలో అపార పంటనష్టం వాటిల్లింది. ఏపీలో పిడుగులు పడొచ్చని వార్నింగ్ కూడా ఇచ్చింది వాతావరణ శాఖ. వర్షం వచ్చేటప్పుడు చెట్ల క్రింద ఉండొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు అధికారులు. సకాలంలో రాని వర్షాలు.. ఆకాలంలో దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై పగబట్టినట్లు కుండపోతతో విజృంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది.

ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. పశ్చిమ విదర్భ నుంచి మరాఠడ్వా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉరుములు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు, అకాల వర్షానికి వరి పంటంతా నీటిపాలు అయిందని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈదురు గాలులకు మామిడి పంటంతా నేలరాలడంతో రైతులు తల్లడిల్లుతున్నారు.

]]>
https://kpsnetwork.in/02/05/2023/2478/feed/ 0 2478
ఆంధ్రాలో వేల ఎకరాల్లో తడిసిన ధాన్యం-తెలంగాణాలో వర్షం https://kpsnetwork.in/13/12/2022/2191/ https://kpsnetwork.in/13/12/2022/2191/#respond Tue, 13 Dec 2022 04:30:04 +0000 https://kpsnetwork.in/?p=2191 అమరావతి : మాండూస్ తుపాన్ తీరం దాటిపోయినా…వర్షాలు వీడటం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో తుపాన్ దెబ్బకి రాయలసీమ, దక్షిణ కోస్తా కలిపి ఆరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తునారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని వర్షం వీడటం లేదు. హైదరాబాద్ లో ముసురు పట్టి చిన్నచిన్నజల్లులతో కూడిన వర్షం అలా పడుతూనే ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి, చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండురోజుల్లో పంటను తీసుకువెళ్లి ఒబ్బిడి చేసుకుందామనే వేళ మాయదారి తుపాను రోడ్డున పడేసిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ధాన్యం తడిసిపోతే, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పత్తిపంట పాడైపోయిందని, మరోవైపు వానల వల్ల మిరపరైతులకు నష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ విషయానికి వస్తే మాండూస్ తుపాను ప్రభావం మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అంటున్నారు. తుపాను వదిలిపోయినా వర్షాలు పడుతుండటంపై వాతావరణంలో సమతుల్యత దెబ్బతిందని, విపరీతమైన ఎండలు, వణికించే చలి గాలులు ఇవన్నీ వీటి ఫలితమేనని సీనియర్లు నొక్కి వక్కానిస్తున్నారు.

]]>
https://kpsnetwork.in/13/12/2022/2191/feed/ 0 2191
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు.. https://kpsnetwork.in/17/10/2022/2110/ https://kpsnetwork.in/17/10/2022/2110/#respond Mon, 17 Oct 2022 17:06:59 +0000 https://kpsnetwork.in/?p=2110 విశాఖ : తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందట. దాంతో అక్టోబర్ 20 నాటికి అది తీవ్ర వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి “సిత్రాంగ్” అని పేరు పెట్టారు.

సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో “వదలని” అని అర్థం. సిత్రాంగ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు కురువనున్నాయట.

మరోవైపు నవంబరులో ఏర్పడే వాయుగుండాలు తుఫానుగా బలపడేందుకు అవకాశముందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.

]]>
https://kpsnetwork.in/17/10/2022/2110/feed/ 0 2110
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు: శాంతించు వరుణదేవా… https://kpsnetwork.in/16/07/2022/1899/ https://kpsnetwork.in/16/07/2022/1899/#respond Sat, 16 Jul 2022 01:53:08 +0000 https://kpsnetwork.in/?p=1899 హైదరాబాద్ : తెలంగాణ జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఇంత భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న జనం.. వరుణుడు ఇకనైనా శాంతిస్తే బాగుండునని వాపోతున్నారు.

కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. రాష్ట్రంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరో 8 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కరీంనగర్ జిల్లా రామడుగులోని గుంది ప్రాంతంలో అత్యధికంగా 20.8 సెం.మీ, చొప్పదండిలోని ఆర్నకొండ ప్రాంతంలో 20.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా బోధన్ చిన్న మవందిలో 11.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.

]]>
https://kpsnetwork.in/16/07/2022/1899/feed/ 0 1899