Tuesday, November 3, 2026, 11:02 pm
Latest:
ఆంధ్రప్రదేశ్విశాఖపట్నం

గెలిచినా… ఓడినా… రాజకీయ పదవులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలి! పదవులతో కాదు… వ్యక్తిత్వంతోనే నాయకుడికి నిజమైన గుర్తింపు – కంచరన కిరణ్ కుమార్

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల్లో గెలిచిన వారైనా, ఓడిపోయిన వారైనా ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరినీ సమాజం గౌరవించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్ అన్నారు.

ఎన్నికల్లో గెలిచిన వారికి పదవులు రావచ్చు, ఓడిపోయిన వారికి పదవులు దక్కకపోవచ్చు. అయితే పదవి వచ్చినప్పుడే గౌరవించడం, పదవి లేనప్పుడు పట్టించుకోకపోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి ఉన్న గౌరవం ఆయన రాజకీయ విజయాలపై కాకుండా, ఆయన వ్యక్తిత్వం, సేవాభావం, ప్రజల పట్ల చూపించే బాధ్యతపై ఆధారపడి ఉండాలని తెలిపారు.

రాజకీయ పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా పరస్పర గౌరవం మాత్రం అందరిలో ఉండాలని, గెలిచిన నాయకులు ఓడిపోయిన నాయకులను కూడా గౌరవించాలని, అదే విధంగా ఓడిపోయిన వారు కూడా ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని సూచించారు.

“పదవులు శాశ్వతం కాదు… అధికారం శాశ్వతం కాదు… కానీ మనం సంపాదించుకున్న గౌరవం, మంచి పేరు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి” అని కంచరన కిరణ్ కుమార్ పేర్కొన్నారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×