శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పేడాడ రమణికుమారి
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు గారి ఆధ్వర్యంలో సీతమ్మధార దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు గారు,రాష్ట్ర ,మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ,జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు,ముఖ్య నాయకులు ,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.