సామ్ ఆ ఫిల్మ్ మేకర్ తో చెట్టపట్టాల్
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్ :- స్టార్ హీరోయిన్ సమంత కూడా తన వ్యక్తిగత జీవితాన్ని సెట్ చేసుకునే పనిలో పడిందని రూమర్స్ వస్తున్నాయి. ఓ ప్రముఖ ఫిల్మ్ మేకర్ కు ఆమె సన్నిహితమౌతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
పర్సనల్ లైఫ్ డిస్ట్రబెన్సుల నుంచి కోలుకుని… టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) తారజువ్వలా దూసుకుపోతోంది. వ్యక్తిగతంగానూ, కెరీర్ పరంగానూ స్పీడ్ చూపిస్తోంది. దీంతో బ్యూటీ క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. అంతేకాక మరింత స్పీడ్ పెంచింది. ఊహించని రీతిలో స్టార్ స్టేటస్ తో ముందుకు సాగుతోంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో కెరీర్ ను ఫుల్ ఫామ్ లోకి తీసుకొస్తున్న బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
సోషల్ మీడియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న సమంత గురించి ఏ అప్ డేట్ వచ్చిన వైరల్ గా మారిపోతోంది. మొన్నటి వరకు… పోస్టులు, కౌంటర్లు, వేదాంతంతో వార్తల్లో నిలిచిన బ్యూటీ… ఇప్పుడు మరో వార్తతో హెడ్ లైన్స్ లో నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్ తో బాలీవుడ్ దర్శకుల జోడీ రాజ్ అండ్ డీకేతో పనిచేసింది సామ్. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత యాక్షన్ స్పై థ్రిల్లర్ సిటడెల్ తెలుగు వర్షన్ హనీ బన్నీలో నటించింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరితో సమంత డేటింగ్ చేస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇన్నాళ్లు సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సమంత… రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ -2 (Family Man -2) సిరీస్ నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. దీంతో తరుచూ ఎక్కడ చూసిన జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఓ మ్యాచ్ లో సందడి చేసిన ఈ జోడీ రీసెంట్ గా ఫ్రెండ్ బర్త్ డేలోను కలిసి ప్రత్యక్షమవ్వగా.. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత గ్రీన్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌తో మెరిసిపోగా, రాజ్ నిదిమోరు కాజువల్ టీషర్ట్, జీన్స్‌లో కనిపించాడు. అయితే రాజ్ అండ్ డీకే తో మరో ప్రాజెక్ట్ చేస్తుందని… అందులో భాగంగానే… కలిసి వచ్చిందని మరో వెర్షన్ టాక్. గత కొన్ని రోజులుగా డేటింగ్ వార్తలు జోరందుకున్న తరుణంలో అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. మరీ రూమర్లకు చెక్ పడాలంటే… సమంత నోరు విప్పాలిందే. చూడాలి మరి… ఆ డేటింగ్ వార్తలు ఎలాంటి యూ టర్న్ తీసుకుంటాయో.