ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, అమరావతి :- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు(బుధవారం) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్ను విడుదల చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల(అక్టోబర్) 28న ఎన్నికలు జరగనుండగా.. 30న ఫలితాలు వెల్లడికానున్నాయి.
షెడ్యూల్ ఇదే..
అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు
అక్టోబర్ 19న నామినేషన్ల స్క్రూటినీ
అక్టోబర్ 21లోపు నామినేషన్లు ఉపసంహరణ
అక్టోబర్ 28న ఎన్నికలు.. 30న ఫలితాలు
నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
నవంబర్ 26న తొలిదశ పంచాయతీ ఎన్నికలు
నవంబర్ 29న రెండోదశ పంచాయతీ ఎన్నికలు
డిసెంబర్ 2న మూడోదశ పంచాయతీ ఎన్నికలు

