తెలంగాణహైదరాబాద్

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్ :- దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌కి (Duvvada Madhuri Srinivas) బిగ్ షాక్ తగిలింది. (గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(JBIET) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్‌హౌస్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు పలువురు ప్రముకులు హాజరైనట్లు సమాచారం.

ఈ క్రమంలో బర్త్ డే పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్ డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్క బాటిళ్లను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×