నారా లోకేష్ దృష్టికి పలు ప్రధాన సమస్యలను తీసుకెళ్లిన సనపల వరప్రసాద్
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- రాష్ట్ర విద్యాశాఖ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గం 50 వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,విశాఖ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధికార ప్రతినిధి సనపల వరప్రసాద్ విశాఖలో ఉన్న మంత్రి లోకేష్ గారిని కలిశారు.ఈ సందర్భంగా 50వ వార్డులో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను లోకేష్ దృష్టికి వరప్రసాద్ తీసుకువెళ్లారు. ముఖ్యంగా లోకేష్ గారికి వరప్రసాద్ గారు ఉత్తర నియోజకవర్గంలో గల మాధవధార,మురళి నగర్ లో భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ఇదే పెద్ద సమస్యని వార్డులో తన ద్రుష్టికి వచ్చాయని ఈ ఈ 22a లో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు పెళ్లిలు చేయాలన్న విద్యార్థులు చదువుకోవాలన్న బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదని తక్షణమే దీన్ని పరిశీలిస్తే ప్రజలకు చాలామందికి ఉపయోగంగా ఉంటుందని దీనిమీద వార్డులో గ్రామసభలు లో కూడా ఎక్కువసార్లు ప్రజలు ఈ విషయంపై చాలా విన్నత పత్రములు ఇచ్చారు చాలాసార్లు పూర్తిగా వివరాలు తెలుసుకున్న నేను గ్రామ సభలలో గౌరవనీయులు లోకేష్ గారికి ఈ విషయంపై త్వరలో మాట్లాడుతానని గ్రామసభలలో చెప్పడం జరిగింది. తక్షణమే దీనిపై పరిష్కారం కావాలని వరప్రసాద్ గారు కోరారు దీనిపై వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యలపై లోకేష్ గారు తక్షణమే పూర్తిగా పరిశీలించి పరిష్కరిస్తారని హామీ ఇస్తూ సానుకూలంగా స్పందించారు.

