ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన తీవ్రఅల్ప పీడనం
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఎల్లుండికి తుఫాన్ గా మారే అవకాశం తుఫాన్ ఏర్పడిన తర్వాత థాయిలాండ్ సూచించిన మెంథా గా నామకరణం..ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటనున్న తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు ప్రస్తుతం వాయుగుండం పోర్ట్ బ్లెయిర్ కు పశ్చిమ-నైరుతి దిశలో 420 కి.మీ., విశాఖపట్నంకి పశ్చిమ-నైరుతి దిశలో 990 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంలో 990 కి.మీ., కాకినాడకి ఆగ్నేయంగా 1000 కి.మీ,. గోపాల్పూర్ దక్షిణ-ఆగ్నేయంలో 1040 కి.మీ. దూరంలో కేంద్రీకృతo మెంథా తుఫాన్ ప్రభావంతో అలెర్ట్ అయిన 4 రాష్ట్రాలు ఏపీ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ఐఎండీ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.

