ఆంధ్రప్రదేశ్

జగన్‌ను వెంటాడుతున్న భయం, బెంగుళూరులో స్టే, అదే స్ట్రాటజీ

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- వైసీపీ అధినేత జగన్ బెంగుళూరులో మకాం పెట్టబోతున్నారా? నెల రోజుల వ్యవధిలో మరోసారి బెంగుళూరుకు ఎందుకు వెళ్లినట్టు? జగన్‌ను వెంటాడుతున్న భయాలేంటి? అరెస్ట్ భయం వెంటాడుతోందా? గత స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను, కార్యకర్తలను వెంటాడుతున్నాయి.

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మరోసారి బెంగుళూరు వెళ్లారు. నెల రోజుల వ్యవధిలో ఆయన అక్కడికి వెళ్లడం ఇది మూడోసారి. చీటికి మాటికీ ఆయన బెంగుళూరు వెళ్లడానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. తాడేపల్లిలో ఉంటే ఎవరైనా వచ్చి తనను కలిస్తే మీడియా లేనిపోని రాద్దాంతం చేస్తోందని భావించి బెంగుళూరులో మకాం పెట్టాలని కొందరు వైసీపీ పెద్దలు చెబుతున్నమాట.

రాబోయే ఐదేళ్లు ఎక్కువకాలం జగన్ బెంగుళూరులోనే గడుపుతారని అంటున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చిన చెప్పాల్సిన నాలుగు మాటలు మీడియా ముందు చెప్పేసి వెళ్లి పోతారని అంటున్నారు. దీనికితోడు గతంలో జగన్ సర్కార్ తీసుకున్న ప్రతీ నిర్ణయాలను కూటమి సర్కార్ విచారణ చేయించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తనను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చునని భావించి, ముందుగానే జగన్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.

2014-19 మధ్యకాలంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండడంతో ఎక్కువగా హైదరాబాద్‌లో ఉన్నారాయన. సమయం వచ్చినప్పుడు, నేతలు జాయినింగ్ సమయంలో మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇక కోడి కత్తి డ్రామా విశాఖ ఎయిర్‌పోర్టు లో జరిగింది. జగన్ పరిస్థితిని గమనించిన కూటమి నేతలు తలోవిధంగా చర్చించు కుంటున్నారు. ట్రావెలింగ్‌లో జగన్‌‌కు ఏమైనా జరిగితే వైసీపీ నేతలు, బ్లూ మీడియా లేనిపోని రాద్ధాంతం చేయడం ఖాయమని అనుకుంటున్నారు.

Leave a Reply