యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్.. ‘విదాముయార్చి’ పోస్టర్ వైరల్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, హైదరాబాద్ :- కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘విదాముయార్చి’. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అర్జున్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు.
మగిజ్ తిరుమేని దర్శకత్వంలో కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘విదాముయార్చి’. ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా మరో క్రేజీ అప్డేట్ వదిలారు.
యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్.. ‘విదాముయార్చి’ పోస్టర్ వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్
ఈ చిత్రంలో త్రిష (Trisha) కథానాయికగా నటించగా.. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కసాండ్రా (Regina Kasandra), అరవ్ కిజర్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మూవీ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు . ఈ పోస్టర్ లో అర్జున్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా.. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇందులో అజిత్, త్రిష భార్యాభర్తలుగా కనిపించనున్నారు.
స్టోరీ లైన్
ఒక ట్రిప్ కు వెళ్లిన భార్యాభర్తల కథ అనుకోని మలుపు తిరుగుతుంది. భార్య తప్పిపోవడంతో.. ఆమెను వెతికే ప్రయత్నంలో భర్తకు ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.