టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు పైశాచిక దాడి..కంచారన కిరణ్ సీరియస్
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- వీధినపడి కొట్టుకోవడం, పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లడానికి మీడియా కచ్చితంగా చూపిస్తుందని.. ఆ కోపాన్ని భౌతిక దాడుల ద్వారా ప్రదర్శించడం దారుణమన్నారు KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్ చైర్మన్ & ఎం.డి గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడిని KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్ తీవ్రంగా ఖండిస్తోంది.