అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్..
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తెలంగాణ హైకోర్టు :- అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం నటుడు కాబట్టే 105 (B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా? అని హైకోర్టు స్పందించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని తెలిపింది. అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపైనే రుద్దలేం అని పేర్కొంది.
ఇంతకీ ఏం జరిగింది?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నిన్న అంటే డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అదే సమయంలో ఈ సినిమా ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు.
దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. రేవతి ఆ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.