బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్ :- వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా 9000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ. 2, 07, 000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే రెండు లక్షలు దాటేసింది. మరోవైపు బంగారం కూడా మరింత పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో వెండి, బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా 9000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ. 2, 07, 000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే రెండు లక్షలు దాటేసింది.
ఈ రోజు (డిసెంబర్ 10న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 19, 450కి చేరింది (live gold rates). ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 30, 460కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 19, 600కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 310కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1, 19, 450కి చేరింది (Gold price in Hyderabad).

