హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విజయవాడ :- కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను గురువారం ఉదయం విజయవాడలో కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. విషయం తెలుసుకున్న మంత్రి అనిత రెండ్రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలనుందని జయశాంతి కోరారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ను పిలిపించుకొని వారితో కలిసి అనిత అల్పాహారం చేశారు. ఆమె కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.జయశాంతి పిల్లలతో మంత్రి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులను సత్కరించారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు.

