తెన్నేటి నగర్లో 48 గంటలుగా అంధకారం.. పట్టించుకోని ప్రభుత్వం! విద్యుత్ సరఫరా లేక ప్రజల ఇబ్బందులు.. అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు!
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం, తెన్నేటి నగర్ :- తెన్నేటి నగర్లో గత 48 గంటలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా అంధకారంలోనే కాలం గడపాల్సి వస్తోందని, అయినప్పటికీ సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, తాగునీరు, నిత్యావసర పనులు సహా పలు సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కనీస సౌకర్యమైన విద్యుత్‌ను సైతం అందించలేని పరిస్థితిపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, తెన్నేటి నగర్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని తెన్నేటి నగర్ వాసులు కోరుతున్నారు.

