ఆంధ్రప్రదేశ్విశాఖపట్నం

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌పై చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలి

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌పై చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కంచరన కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, వ్యక్తులను కించపరిచే లేదా అవమానించే వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదన్నారు. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, వారి రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మరింత బాధ్యతతో వ్యవహరించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×