రాజకీయ నాయకులు సమాజానికి రోల్ మోడల్‌గా నిలవాలి! వ్యక్తిగత జీవితంపై చర్చలు కాదు… ప్రజలకు ఆదర్శంగా నిలిచే ప్రజా ప్రవర్తన ముఖ్యం – పవన్ కళ్యాణ్ వ్యవహారంపై కంచరన కిరణ్ కుమార్ వ్యాఖ్యలు
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్ స్పందించారు.
రాజకీయాల్లో ఉన్న నాయకులు కేవలం అధికారానికి, పదవులకు మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత కలిగి ఉంటారని ఆయన పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రజలకు మార్గదర్శకంగా ఉండేలా తమ మాటలు, ప్రవర్తన, ప్రజా జీవితంలో తీసుకునే నిర్ణయాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అదే సమయంలో విడాకులు అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత గౌరవం, గోప్యతను సమాజం కాపాడాలని అన్నారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న నాయకుల నుంచి సమాజం ఆశించే విలువలు, బాధ్యతలు, ఆదర్శవంతమైన ప్రవర్తనపై చర్చ జరగడం సహజమని పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలంటే మాటల్లోనే కాకుండా చేతల్లోనూ బాధ్యత, గౌరవం, సామాజిక విలువలను పాటించాలని కంచరన కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
“రాజకీయం అంటే కేవలం అధికారం కాదు… సమాజానికి మార్గదర్శకంగా నిలిచే బాధ్యత. నాయకుడి ప్రతి అడుగు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు.

