మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెందుర్తి JNNURM కాలనీలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ మీసాల విజయలక్ష్మి ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా మీసాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆమె కోరారు.
మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కరిగి ప్రకృతిలో కలిసిపోతాయని, తద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని వివరించారు. మన పూర్వీకులు ప్రకృతిని గౌరవిస్తూ పాటించిన సంప్రదాయాలను కొనసాగిస్తూ మట్టి వినాయకుడినే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
కాలనీ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాలనీ ప్రెసిడెంట్ మీసాల విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

