విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కి లేఖ రాసిన .. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కంచరాణ కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- గౌరవనీయ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కంచరాణ కిరణ్ కుమార్ గారు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీ దానేటి కామేశ్వరరావు గారు ప్రభుత్వ విద్యా నియమాలను ఉల్లంఘించిన విషయంపై చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ ఎంతో ముఖ్యమైనది. అందువల్ల ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించి, నిజానిజాలు పరిశీలించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కానీ దృఢంగా మనవి చేస్తున్నాము.
ప్రజల్లో నమ్మకం నిలుపుకోవడానికి మరియు విద్యా వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

