ఆంధ్రప్రదేశ్గుంటూరు

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. రూ.10 కోట్లు పోగొట్టుకున్న వైద్యుడు.. రంగంలోకి పోలీసులు..!

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, గుంటూరు :- రంగంలోకి దిగిన పోలీసులు జయరాజ్ ను, దీపక్ కు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి ఢిల్లీకి పంపించారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాలను ట్యాంపరింగ్ చేసి జీరోగా చూపించినట్లు..

గుంటూరు నగరంలోని ప్రముఖ వైద్యశాలలో పని చేస్తున్న డాక్టర్ జయపాల్‌ మోసగాళ్ల వలలో పడిపోయాడు. ఈ వైద్యుడికి గుంటూరు నగరానికే చెందిన దీపక్ రాజ్ పరిచయం అయ్యాడు. డిగ్రీ పూర్తి చేసి క్రిప్టో కరెన్సీ ట్రేడర్స్, ఇన్వెస్టర్ గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. ఆర్టీసీ కాలనీలో ఉండే దీపక్ తరుచు డాక్టర్ వద్దకు వచ్చేవాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలుంటాయని దీపక్ నమ్మబలికాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడం, తరుచూ వస్తుండటంతో అతనిని నమ్మిన వైద్యుడు.. మొదట కొద్దీగా పెట్టుబడి పెట్టాడు. బైనాన్స్ ప్లాట్ ఫాంపై పెట్టుబడులు పెడితే భారీ లాభాలుంటాయని చెప్పి ఖాతాలు తెరిపించాడు.

దీపక్ రాజ్ మాటలు నమ్మిన డాక్టర్ ఖాతాల్లో పెట్టుబడి పెట్టగా లాభాలు వస్తున్నట్లు చెప్పి ఆన్ లైన్ అకౌంట్స్ ఆధారంగా చూపించాడు. దీంతో అతని మాటలు నమ్మిన వైద్యుడు తరుచూ పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. ఆ వైద్యుడే కాకుండా నగరంలోని పలువురు వద్ద నుండి కూడా అప్పులు తీసుకొచ్చి దీపక్ చెప్పినట్లు క్రిప్టో ఖాతాల్లో ఇన్వెస్ట్ చేశాడు. గత నవంబర్ లో మొదలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. గత నెలలో తన ఖాతాల్లో చూడగా మొత్తం ఇరవై కోట్ల రూపాయలన్నట్లు డాక్టర్ తెలుసుకున్నాడు. వెంటనే తన డబ్బులు తనకి ఇవ్వాలని దీపక్ కు చెప్పాడు. అయితే అదిగో ఇదిగో అంటూ దీపక్.. దాటవేస్తూ వచ్చాడు. కొద్దీ రోజుల తర్వాత ఖాతాలను పరిశీలించగా జీరోగా చూపించాయి. దీంతో అనుమానం వచ్చిన వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు జయరాజ్ ను, దీపక్ కు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి ఢిల్లీకి పంపించారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాలను ట్యాంపరింగ్ చేసి జీరోగా చూపించినట్లు గుర్తించారు. అయితే ఆ ఖాతాలు ఎలా క్లోజ్ అయ్యాయన్న అంశంపై కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. ఒక్క వైద్యుడే ఇన్వెస్ట్ చేశాడా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×