వైశాఖి స్పోర్ట్స్ పార్క్‌లో ఘనంగా సమ్మర్ స్కూల్ – 2026 ముగింపు ఉత్సవాలు
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- విశాఖపట్నం మురళీనగర్‌లోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన సమ్మర్ స్కూల్ – 2026 ముగింపు ఉత్సవాలు శనివారం (30-05-2026) సాయంత్రం వైభవంగా జరిగాయి. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ స్కేటింగ్ రింగ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను చాటుతూ వివిధ సాంస్కృతిక, క్రీడా ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పెన్మెత్స విష్ణుకుమార్ రాజు గారు, విశాఖ వెస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి పేడాడ ప్రదీప్తి గారు చిన్నారులను అభినందించి, వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సమ్మర్ స్కూల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ 50వ వార్డు అధ్యక్షులు, వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ప్రెసిడెంట్ శ్రీ సనపల వరప్రసాద్, బి.టెక్ గారు మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపొందనకు ఇటువంటి సమ్మర్ స్కూల్స్ ఉపయోగపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో తల్లిదండ్రులు, క్రీడా ప్రేమికులు, స్థానిక ప్రజలు, పార్క్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

