ఆంధ్రప్రదేశ్విశాఖపట్నం

దేశవ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రులను మూసివేయాలి! ప్రజల ప్రాణాలే అత్యంత విలువైనవి…!

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- మెడికవర్ ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపించాలి — ప్రధానమంత్రికి లేఖ రాసిన కంచరన కిరణ్ కుమార్.

దేశవ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపించి, రోగుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వైద్య నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే ఆయా ఆసుపత్రులను మూసివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఆసుపత్రి బాధ్యత అని పేర్కొన్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మెడికవర్ ఆసుపత్రులకు సంబంధించి ఉన్న ఆరోపణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, చికిత్స ఖర్చులు, రోగుల భద్రత, అత్యవసర వైద్య సేవలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

విచారణలో వైద్య నిర్లక్ష్యం లేదా చట్ట ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేసి మూసివేయాలని ప్రధానమంత్రికి రాసిన లేఖలో కోరినట్లు కంచరన కిరణ్ కుమార్ తెలిపారు.

ప్రజల ప్రాణాలే అత్యంత విలువైనవి. వైద్య రంగంలో రోగుల భద్రతకు పెద్దపీట వేయాలి. బాధితులకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×