ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి గా కంచారన కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి గా విశాఖ నగరం లోని తెన్నేటి నగర్ కాలనీ కి చెందిన గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఇంచార్జి గా, రాష్ట్ర కన్వీనర్ గా కిరణ్ కుమార్ గత 8 ఏళ్ల గా ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో సేవలు అందించారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ విపిన్ చౌహాన్ ఆదేశాల మేరకు నియముఖ పత్రాన్ని కిరణ్ కుమార్ కి విశాఖ కార్యాలయం లో అందించారు. 8 ఏళ్లు గా సమాజక సేవ చేస్తున్న కిరణ్ నియముఖం పై పలువురు హర్షం వ్యక్తం చేశారు. చట్టం మీద అవగాహన ప్రజాస్వామ్య పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించి పదవికి వన్నే తెస్తా అని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి గా మరింత బాధ్యత పెరిగింది అని తెలిపారు.

