అంతర్జాతీయ వార్తలు

గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మలేషియా :- మలేషియాలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు. మలేషియన్ నేవి వేడుకల కోసం హెలికాప్టర్లు రిహార్సల్ ప్రదర్శన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు. రాయల్ మలేషియన్ నేవి వేడుకల కోసం హెలికాప్టర్లు రిహార్సల్ ప్రదర్శన చేస్తుండగా.. అందులో ప్రమాదవశాత్తు రెండు నేవీ హెలికాప్టర్ల రెక్కలు ఒకదానికొటి తాకాయి. దీంతో క్షణాల్లోనే ఆ రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

లుముట్‌లోని రాయల్ మలేషియన్ నేవీ (RMN) బేస్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. M503-3 మారిటైమ్ ఆపరేషన్స్ హెలికాప్టర్ (HOM)లో ఏడుగురు సిబ్బంది ఉండగా.. మరొక M502-6 హెలికాప్టర్‌లో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలలో 3 – 5వ తేదీల మధ్య జరగనున్న నేవీ డే వేడుకల సందర్భంగా ఈ హెలికాప్టర్లు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.

గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి

Leave a Reply