జాతీయ వార్తలు

ఢిల్లీకి రావాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం లేఖ

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. విభజన చట్టం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు.

ఏపీ పునర్వభజన చట్టంలో పేర్కొన్న అశాలు, వాటి అమలు, ఇంకా అమలుకు నోచుకోని అంశాల అమలు తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని ఇంకా అమ‌లు కాని అంశాల‌పై చ‌ర్చ‌కు కేంద్ర హోం శాఖ సిద్ధ‌మైంది.

ఈ దిశ‌గా ఈ నెల 27న ఇరు రాష్ట్రాల‌తో స‌మావేశం కావాల‌ని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు స‌మావేశానికి హాజ‌రు కావాలంటూ ఆయ‌న ఇరు రాష్ట్రాల సీఎస్‌ల‌కు లేఖ‌లు రాశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌పైనే ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave a Reply