ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు నామినేషన్ దాఖలు చేసిన భువనేశ్వరి

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కుప్పం :- టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ ను ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలో దాఖలు చేశారు. ముందుగా వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ ను ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో (Kuppam) దాఖలు చేశారు. ముందుగా పి. ఈ. ఎస్ మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ నుండి వరదరాజస్వామి ఆలయానికి వెళ్లారు భువనేశ్వరి. ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల నడుమ భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు నామినేషన్ పత్రాలను వరదరాజాస్వామి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదరాజస్వామి దర్శనం అనంతరం శ్రీ పేరుందేవీ తాయర్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని సందడి చేశారు. అనంతరం, భారీ ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

Leave a Reply