అంతర్జాతీయ వార్తలు

తాలిబాన్‌ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు

కాబూల్‌ : అగ్రరాజ్యాలకు ఆఫ్ఘనిస్తాన్‌ ఆటస్థలంగా మారింది. ఒకరు కాకపోతే ఒకరు వచ్చి తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆడుకుంటూ ప్రైజులు గెలువకుండా సంతోషంగా వెళ్లిపోతున్నారు. పోతూపోతూ తమ అస్త్రశస్త్రాలను (Taliban and Weapons) అక్కడే పడేసి పోతున్నారు. వీటిని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్న ఉగ్రవాదులు.. సామాన్యులపైకి చెలరేగుతూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ క్రీడ 19 వ శతాబ్దం నుంచి కొనసాగుతున్నది. ప్రస్తుతం ఇంటికి తిరుగుముఖం పట్టిన అమెరికా దళాలు.. తమ ఆయుధాలను అక్కడే విడిచి వెళ్లిపోతున్నాయి. దాంతో అత్యాధునిక ఆయుధాలు తాలిబాన్‌ చేతుల్లోకి వచ్చాయి. వీటిలో ఎం 16 వంటి అత్యంత ఆధునిక తుపాకులు ఉండటం భయంగొల్పుతున్నది.

19 వ శతాబ్దంలో బ్రిటన్, 20 వ శతాబ్దంలో రష్యా, 21 వ శతాబ్దంలో అమెరికా.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆఫ్ఘనిస్తాన్‌పై తమ ప్రతాపాన్ని చూపారు. విజయాల మాటేమోగానీ.. ఆపజయాలను మాత్రం మూటగట్టుకున్నాయి. మూడు అగ్రరాజ్యాలు ఇక్కడ ఓటమినే చవిచూశాయంటే.. వారెందుకు వస్తున్నారో, వారేం చేస్తున్నారో అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోతున్నది. 1989 లో రష్యన్ దళాలు ఉపసంహరించుకున్న తర్వాత.. ముజాహిదీన్, అనంతరం తాలిబాన్లు టీ-55 ట్యాంకుల మీద రష్యన్ ఏకే 47 తుపాకులతో విహరించడం కనిపించింది. అదే తాలిబాన్‌ ఫైటర్లు ఇప్పుడు అమెరికన్ సాయుధ సైనిక వాహనాల్లో ఎం 16 రైఫిళ్లతో తిరుగుతున్నారు.

Leave a Reply